మంచినీటి చెరువు భూమిలో ఇల్లు కట్టుకుంటా.. భూమిపూజ చేసిన జనసేన నేత.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లిలోని పంచాయతీ మంచినీటి పథకానికి కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకుంటానని జనసేన నాయకుడు భూమి పూజకు సంబంధించిన ఆహ్వానపత్రిక పంచటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటాను భూమి పూజ చేస్తానని ఆహ్వాన పత్రిక పంచడం వెనక పెద్ద కథ నే ఉంది. మరి ఆ కథ కమామీషు లోకి వెళితే

Advertisement

ఆక్రమణలకు గురవుతున్న పంచాయతీ మంచినీటి చెరువు ప్రాంతం

ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లి పంచాయతీ మంచినీటి చెరువు కట్ట పైన ఐదు ఇళ్ళు, ఒక పశువుల పాక తో పాటు, వాటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ లు నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ప్రజల ప్రయోజనానికి ఉద్దేశించిన మంచి నీటి చెరువు ప్రాంతం ఆక్రమణలకు గురి అవుతోందని, దీనిని వెంటనే తొలగించాలని ఫిర్యాదు చేశారు.

Advertisement

జనసేన నేత వినూత్న నిరసన

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మట్ట పూడి మదన్ కుమార్ గత కొంతకాలంగా అధికారులకు అనేక వినతి పత్రాలను సమర్పించారు అయినప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికారులు బాధ్యత రాహిత్యంతో వ్యవహరించడం నచ్చని మదన్ కుమార్ వినూత్న నిరసనను తెలియజేశారు.

భార్యతో మంచినీటి చెరువు స్థలంలో భూమిపూజ, ఇల్లు కట్టుకుంటా అని ఆహ్వాన పత్రికలు

మంచినీటి చెరువు స్థలంలో ఇళ్ళను నిర్మించుకోవడానికి తన భార్యతో కలిసి భూమి పూజ చేశారు. మంచినీటి చెరువు స్థలంలో గృహనిర్మాణం అని ఆహ్వాన పత్రికలను ముద్రించి బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వినూత్న ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మదన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో అధికారులు వైఫల్యం చెందారని, అందుకే తను వినూత్నంగా నిరసన తెలియజేశానని పేర్కొన్నారు.

Advertisement

కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తానన్న జనసేన నేత

తమ భూమి పూజ చేసిన అధికారులలో కదలిక రాకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆక్రమణల పైన మరో మారు జిల్లా కలెక్టర్ ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో కూటమి ప్రభుత్వ హయాంలో అధికారుల తీరు జనసేన నేత బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

English Summary

Janasena leader govt land bhumipuja on encroached government drinking water tank land as a protest against official inaction in Andhra Pradesh. A creative way to highlight public property encroachment issue.