ఏపీకి కేంద్రం మరో వరం.. ఎన్‌హెచ్-42ను విస్తరణకు నిధులు మంజూరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో వరం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న కేంద్రం మరో భారీ జాతీయ రహదారి ప్రాజెక్ట్ కి నిధులను మంజూరు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ నుండి కదిరి వరకు జాతీయ రహదారి NH 42 అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 680 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

Advertisement

NH 42 అప్ గ్రేడ్

ఈ మంజూరు రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచటంలో ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించి, ఆధునిక సౌకర్యాలతో అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇందులో బ్రిడ్జిలు, అండర్ పాస్ లు, డ్రైనేజ్ వ్యవస్థలు, రోడ్ సేఫ్టీ ఫీచర్లు వంటివి చేర్చి ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

ముదిగుబ్బ నుండి కదిరి మధ్య తక్కువ సమయంలో ప్రయాణం

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ ప్రాంతంలోని రవాణా సమస్యలు ఎక్కువగా తీరనున్నాయి. ముదిగుబ్బ నుండి కదిరి మధ్య తక్కువ సమయంలో ప్రయాణం చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు, వాణిజ్య సరుకులు త్వరగా రవాణా చేయటం సాధ్యం అవుతుంది. ఇది స్థానికంగా పారిశ్రామిక ప్రగతికి, ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఈ రోడ్డు మార్గం పూర్తి అయితే ప్రయాణాలు సులభతరం అవుతాయి.

రోడ్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అన్ని విధాలా లబ్ది

ఈ రోడ్డుతో వ్యాపారులు, రైతులు, ప్రయాణికులు బాగా లాభపడతారు. ఈ రోడ్డు ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ రోడ్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అన్ని విధాలా లబ్ది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పురోగతి కనిపిస్తుంది.

Advertisement
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇకపై 24 గంటలూ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ సేవలు!

శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర

శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరగా ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్థానికుల నుండి డిమాండ్ వ్యక్తమవుతుంది. జాతీయ రహదారి 42 అప్ గ్రేడేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రవాణా మౌలిక సదుపాయాలు మరింత బలపడనున్నాయి. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ కూడా తనవంతుగా కీలక భూమిక పోషిస్తుంది.

English Summary

NH 42 Upgradation: Central Govt, prioritizing the development of national highways in Ap, The Centre has approved ₹680 crore for the development of National Highway 42 (NH-42) from Mudigubba to Kadiri in Sri Sathya Sai district.