AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో వాతావరణం మారింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఇప్పటికే వర్షాలు (rain)కురుస్తున్నాయి. వీటి ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది.

Advertisement
DSC పోరులో వైసీపీకి షాక్ ..! తేల్చేసిన ఏపీ హైకోర్టు ..!
Advertisement

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు (గురువారం) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ వెల్లడించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించింది.

AP Govt: ఆయుష్ వైద్యానికి ఏపీ గుర్తింపు-7 కేటగిరీల్లో ఆస్పత్రులు-రూల్స్ ఇవే..!

రాష్ట్రంలో ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు రైతులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎల్ నినో వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు పలు చర్యలు తీసుకుంటోంది. అయినా పూర్తిస్దాయిలో వర్షాలు కురిస్తే కానీ రైతులు గట్టెక్కే పరిస్ధితులు కనిపించడం లేదు.