RRB Exam 2026: విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లు- తేదీలు, హాల్ట్ లు ఇవే..!

ఈ ఏడాది ఆగస్టు నెలలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్టు నిర్వహించే పరీక్షల (RRB Exam 2026) కోసం దక్షిణ కోస్తా రైల్వే జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను (Janasadharan Special trains) ప్రకటించింది. విజయవాడ నుంచి పలాస మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్, స్టాప్ ల, ఇతర వివరాలను దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ విడుదల చేసింది. కాబట్టి ఈసారి రైల్వే పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు వీటిని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

హైదరాబాద్ - మంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ నెల 2 వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ విజయవాడ- పలాస మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇవన్నీ అన్ రిజర్వుడు రైళ్లే. వీటిలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. నేరుగా టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. ముందుగా పలాస నుంచి విజయవాడకు ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున ప్రత్యేక రైళ్లు (నంబర్ 07067)అందుబాటులో ఉంటాయి. అలాగే విజయవాడ నుంచి పలాసకు ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ మరో నాలుగు రైళ్లు (నంబర్ 07068) ఇలాగే రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి.

Advertisement

Vijayawada MEMU Trains: ఈ విజయవాడ రైళ్లకు కోచ్ ల మార్పు..! ఈ తేదీల్లో..!

ఈ రైళ్లు ఆయా తేదీల్లో పలాస నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు మీదుగా విజయవాడకు అర్ధరాత్రి 1 గంటకు చేరుకుంటాయి. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం 4.30కు బయలుదేరే ఈ ప్రత్యేక రైళ్లు ఇవే స్టేషన్ల మీదుగా మరుసటి రోజు తెల్లవారుజామున 4.30కు పలాస చేరుకుంటాయి. ఇందులో ప్రతీ రైలు లోనూ 10 జనరల్, రెండు స్లీపర్ క్లాస్ తో కూడిన మొత్తం 12 బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.