వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీలో కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar reddy)కి ఇవాళ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో తనతో పాటు నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన చెవిరెడ్డికి ఊరట దక్కలేదు. అయితే ఈ వ్యవహారం వెనుక జగన్ ను ఇరికించే కుట్ర ఉందన్న చెవిరెడ్డి ఆరోపణలతో సుప్రీంకోర్టు తీర్పుకు ప్రాధాన్యం ఏర్పడింది.
సుప్రీంలో పంతం నెగ్గించుకున్న రఘురామ..! కీలక తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న దొడ్డా వెంకట సత్య ప్రసాద్ కు గతంలో కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చెవిరెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. అదే సమయంలో ఈ పిటిషన్ లో చెవిరెడ్డి లేవనెత్తిన అనుమానాలపై సీజేఐ స్పందిస్తూ..సరైన సమయంలో తమ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. ప్రస్తుతానికి మాత్రం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చారు.
అయితే చెవిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఓ కీలక కారణం ఉంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, ఇందులో జగన్ హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్న అధికార కూటమి దాన్ని నిరూపించడంలో ఇప్పటివరకూ విఫలమైంది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కాంలో ఇప్పటికే నిందితుడిగా గుర్తించిన దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను సీఐడీ అప్రూవర్‌గా మార్చి జగన్ ను నిందితుడిగా మార్చేందుకు చూస్తోందనేది చెవిరెడ్డి ఆరోపణ. అందుకే సత్యప్రసాద్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంవరకూ వెళ్లారు. అయినా ఆయనకు ఊరట లభించలేదు.తల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ - తాజా షెడ్యూల్ ప్రకటన..!