విధినిర్వహణలో ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారి పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. రక్షణ కల్పించే పోలీసులపైనే దౌర్జన్యానికి దిగిన వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీఅధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా బూర్జ మండలంలో భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు.
ఎస్సై విధులకు ఆటంకం
ఈ పర్యటన బందోబస్తు విధుల్లో భాగంగా బూర్జ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవల్లిక తన విధులను నిర్వర్తించారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న ఆ మహిళా ఎస్సైని ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ , ఆయన అనుచరులు తీవ్రంగా అడ్డుకున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, విధులకు తీవ్ర భంగం కలిగించేలా దురుసుగా ప్రవర్తించారు.
వైసీపీ ఎమ్మెల్సీకి కీలక పదవి- మారుతున్న లెక్కలు..!!
ఒక మహిళా అధికారి అని కూడా కనీస మర్యాద ఇవ్వకుండా దౌర్జన్యానికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన విధులకు ఆటంకం కలిగించిన వైసీపీ నేతతో పాటు, ఆ పార్టీ కార్యకర్తలపై కూడా ఎస్సై ప్రవల్లిక బూర్జ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆముదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు A1గా చేర్చారు. రవికుమార్‌తో పాటు ఈ దౌర్జన్యకాండలో ప్రత్యక్షంగా భాగస్వాములైన మరో 20 మంది వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారనే విషయం తెలియగానే, నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ భయంతో ప్రధాన నిందితుడు చింతాడ రవికుమార్ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఈ ఘటనలో నిందితులుగా ఉన్న మిగతావారూ పరారీలో ఉన్నారు. ఈ ఉదంతాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సీరియస్‌గా తీసుకుంది. పరారీలో ఉన్న రవికుమార్‌తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి, గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశారు. త్వరలోనే వారందరినీ అదుపులోకి తీసుకుంటామని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసు అధికారుల మీదే, అందునా మహిళా ఎస్సైపై ఈ తరహా దౌర్జన్యాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయాల్లో ఉండి ప్రజా ప్రతినిధులుగా లేదా బాధ్యతాయుత పదవుల్లో కొనసాగాల్సిన వారు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన
వైసీపీ నేతలపై కేసు నమోదు
మైనర్ బాలికపై ముగ్గురు ఆటో డ్రైవర్ ల ఘాతుకం.. పోక్సో కేసు నమోదు!
పరారీలో వైసీపీ ఇన్ఛార్జ్
ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ