అరుణాచలంలో మాత్రమే కాదు సింహాచలంలోనూ గిరి ప్రదక్షిణ అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ మేరకు నేడు, రేపు సింహాచలంలో జరుగుతున్న గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. సుమారు 32కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5 నుండి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
అత్యంత వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ
ఈ క్రమంలో సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ క్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటలకు పుష్ప రథంతో గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ప్రతి ఏడాది ఆషాడ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా దీనిని ఘనంగా నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ట్రాఫిక్ భద్రత, తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, విద్యుత్ పైన ప్రధాన దృష్టి సారించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశాఖ నగరపాలకసంస్థ 32 కిలోమీటర్ల మేర 30 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా సిద్ధమైంది. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం వైద్య సేవలు అందించడానికి 31 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్ కు పోలీస్, gvmc అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. సింహాచలం తొలి పావంచ, అడవివరం జంక్షన్, హనుమంతు వాక, అప్పు ఘర్, మాధవధార, ఎన్ ఎస్ టి ఎల్ గేట్, గోపాలపట్నం ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. అంతేకాదు గిరి ప్రదక్షిణ మార్గంలో 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్ ఎఫ్ ఐడి టాగ్ లను అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను చదును చేసి సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం 31 వైద్య శిబిరాల ఏర్పాటు
కంట్రోల్ రూమ్ లు, సీసీ కెమెరాల ఏర్పాటు
ఫ్లైఓవర్ల కింద ఇండోర్ సబ్‌స్టేషన్లు.. హైదరాబాదీల కరెంట్ కష్టాలకు చెక్!
పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ లు