విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్.. త్వరలో భూసేకరణ, రూట్లు ఇవే!

మెట్రో నగరాలలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం మెట్రోరైలు ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా రూ.11,009 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్రధాన కారణాలలో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కీలకచర్యలు చేపట్టారు.

Advertisement

విజయవాడ మెట్రోకు భూసేకరణపై ఫోకస్

ఇప్పటికే కేసరపల్లి, గన్నవరం ప్రాంతాలలో పర్యటించి భూసేకరణ ప్రక్రియపైన దృష్టి సారించారు. మొత్తం మొదటి దశలో 38.40కిలోమీటర్ల మేర లైట్ రైల్ ట్రాన్సిట్ వ్యవస్థని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా కారిడార్ వన్ లో గన్నవరం నుండి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు 25.9కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ఆ తర్వాత పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి పెనమలూరు వరకు 12.5కిలోమీటర్ల మేర కారిడార్ 2 ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్

ఈ రెండు మెట్రో కారిడార్ ల ఏర్పాటుకు దాదాపు 91 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మెట్రో అధికారులు స్థానిక అధికారులతో మెట్రో అలైన్మెంట్ పైన, ప్రతిపాదిత 34 స్టేషన్ల స్థలాల పైన, కేసరపల్లి వద్ద నిర్మించబోయే ఆధునిక కోచ్ డిపోకు కావలసిన భూముల వివరాల పైన సమీక్షించారు. ప్రభుత్వ భూములు మినహా ప్రైవేటు స్థలాలను గుర్తించి భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రతిపాదనను కూడా సిద్ధం చేశారు.

ఈ ప్రాంతాల మీదుగా మెట్రో రైలు ప్రాజెక్టు కారిడార్ 1 రూట్

ప్రస్తుతం కలెక్టర్ల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులతో భూసేకరణ పరిహారానికి సంబంధించిన అంచనాలు వేస్తున్నారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు కారిడార్ 1 లో A రూట్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్, గుణదల, రామవరప్పాడు రింగ్ రోడ్డు, గన్నవరం ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాలకు ఉంటుంది.

Advertisement
హైదరాబాద్ మెట్రో రెండోదశ ఎంజీబీఎస్-ఫలక్‌నుమా కారిడార్‌పై విచారణ ఆగస్టు 24కు వాయిదా

ఈ ప్రాంతాల మీదుగా విజయవాడ మెట్రో కారిడార్ 1 B

కారిడార్ 1 Bలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, మున్సిపల్ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు ఏర్పాటు చేస్తారు. మెరుగైన పట్టణ రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం, ట్రాఫిక్ రద్దీ నియంత్రించడం కోసం, ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడం కోసం ఈ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నారు. అయితే భూసేకరణ సాంకేతిక అధ్యయనాలు పనులు వేగంగా జరుగుతుండడంతో త్వరలోనే మెట్రో నిర్మాణ పనులను కూడా ప్రారంభమవుతాయని సమాచారం.

English Summary

Vijayawada Metro: Andhra Pradesh Metro Rail Corporation officials inspect Gannavaram and Kesarapalli areas to speed up land acquisition for the first phase of Vijayawada Metro project connecting airport to PNBS.