కూతురిని ముద్రగడ బహిష్కరణ వెనుక అసలు కారణం..! పవన్ తో సంబంధం లేదా ?


మాజీ మంత్రి, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) నిన్న హైదరాబాద్ లో కన్నుమూశారు. కొంతకాలంగా అక్కడి సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ నిన్న తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ముద్రగడ భౌతిక కాయాన్ని చూసేందుకు అభిమానులు కిర్లంపూడిని ఆయన నివాసానికి భారీగా తరలివస్తున్నారు. ఈ తరుణంలో అక్కడికి వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిని (Kranti Barlapudi) మాత్రం కుటుంబ సభ్యులు, అభిమానులు, చివరికి పోలీసులు కూడా అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు.

Advertisement
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఇక లేరు..! శోకసంద్రంలో అభిమానులు..!
Advertisement

దీని వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తన పార్టీ అభ్యర్ధి వంగా గీతకు మద్దతుగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని కూడా ప్రకటించారు. అదే సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి.. అక్కడికి ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. కానీ పవన్ అప్పటికే ముద్రగడ అభిమానుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని ఆమెను సున్నితంగా వారించి అక్కడి నుంచి పంపేశారు.

Advertisement

Mudragada: ముద్రగడ మృతిపై సంతాపాల వెల్లువ..! జగన్, పవన్ సహా నేతల ప్రకటనలు..!

ఆ తర్వాత ఎన్నికల్లో పవన్ గెలవడం, ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం, క్రాంతి జనసేనలో భర్తతో కలిసి చేరిపోవడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత వైఎస్సార్సీపీని, జగన్ ను ఉద్దేశించి, తన తండ్రిని రాజకీయంగా వాడుకుంటున్నారని, అనారోగ్యం పాలైనా పట్టించుకోవడం లేదని కూడా విమర్శలు చేశారు. అయితే ఇవాళ తండ్రి ముద్రగడను చివరిసారి చూసేందుకు వచ్చిన క్రాంతిని అందరూ అడ్డుకోవడం వెనుక గతంలో జరిగిన ఓ ఘటనే కారణం.

Advertisement

Mudragada Padmanabham: జగన్ ను రావొద్దని చెప్పేశాం..! ముద్రగడ కుమారుడు గిరి వీడియో..!

అప్పట్లో ముద్రగడ భార్య క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాక అక్కడే ఉంటున్న క్రాంతి ఇంటికి భర్తతో కలిసి వెళ్లారు. కానీ వ్యక్తిగత కారణాలతో క్రాంతి, ఆమె భర్త ముద్రగడ దంపతుల్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఐదు నిమిషాలు కూడా ఇంట్లోకి రావద్దని చెప్పేశారట. అదే విషయాన్ని ఆ తర్వాత ముద్రగడ ఓ ప్రెస్ మీట్లో చెప్పుకుని బాధపడ్డారు. ఇప్పుడు తనపై ప్రేమ కురిపిస్తున్నారని కూడా చెప్పుకున్నారు. ఇవాళ అదే క్రాంతిని ముద్రగడ కుటుంబం తండ్రి శవాన్ని చూడకుండా అడ్డుకోవడం వెనుక కారణం కూడా ఇదే. ఆమె జనసేన పార్టీలో చేరడం, తండ్రితో రాజకీయంగా విభేధించడం మాత్రం కాదు.