మన దేశంలో అపర కుబేరులు, 104 లక్షల కోట్ల సంపద సాక్షిగా ..

భారత ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న శ్రీమంతుల చిత్రపటంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అంపశయ్యపై వారసత్వ సంపద ఊగిసలాడుతుంటే.. సొంత ప్రతిభ, ఆవిష్కరణలతో పైకి వచ్చిన నవతరం పారిశ్రామికవేత్తలు దూసుకొస్తున్నారు. తాజాగా వెలువడిన '360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026' (క్రిసిల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యంతో) గణాంకాల ప్రకారం భారత్‌లో రూ.425 కోట్లకు పైగా ఆస్తులున్న శ్రీమంతుల సంఖ్య ఏకంగా 3,040కి చేరింది. వీరందరి మొత్తం ఆస్తుల విలువ మైండ్ బ్లాకింగ్ అనిపించేలా దాదాపు రూ. 104 లక్షల కోట్లుగా నమోదు కావడం గమనార్హం!

Advertisement

వారసులను దాటేసిన స్వయంకృషి నాయకులు!

వ్యాపార రంగం అనగానే ఒకప్పుడు టాటా, బిర్లా, అంబానీ లాంటి బడా ఫ్యామిలీల పేర్లే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. తాజా జాబితాలో వారసత్వంగా ఆస్తులు పొందిన వ్యాపారవేత్తలు (1,290 మంది) కంటే, తమ సొంత ఆలోచనలు, స్టార్టప్‌లతో సున్నా నుంచి సామ్రాజ్యాలు నిర్మించిన స్వయంకృషి నాయకులే (1,696 మంది) ఎక్కువగా ఉండటం పారిశ్రామిక విప్లవానికి సంకేతం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదొక చారిత్రాత్మక మార్పుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Advertisement

టాప్-10 హవా: ఇంకా వారి చేతుల్లోనే సగం ఆస్తులు!

స్వయంకృషి పెరిగినప్పటికీ, దేశంలోని ప్రధాన సంపద మాత్రం ఇంకా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. జాబితాలోని మొత్తం సంపదలో దాదాపు 49 శాతాన్ని కేవలం టాప్ 10 పారిశ్రామిక కుటుంబాలే నియంత్రిస్తుండటం గమనార్హం.

  • గౌతమ్ అదానీ ఫ్యామిలీ: రూ.9,08,178 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో నిలిచింది.
  • ముఖేష్ అంబానీ ఫ్యామిలీ: రూ.8,93,622 కోట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. (అంబానీ వారసులు అనంద్, ఇషా, ఆకాష్ ప్రతి ఒక్కరి ఆస్తి రూ.2.75 లక్షల కోట్లకు పైమాటే).
  • సునీల్ భారతీ మిత్తల్ ఫ్యామిలీ: రూ.4,96,687 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

తిరుమల శ్రీవారిని సన్నిధిలో అనంత్ అంబానీ.. రూ.27.5 కోట్ల భారీ విరాళం !!

Advertisement

లేడీ పవర్: దూసుకెళ్తున్న మహిళా కుబేరులు!

ఈసారి శ్రీమంతుల జాబితాలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఏకంగా 738 మంది మహిళలు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించగా, మొత్తం ఆస్తుల్లో వీరు 22.6 శాతానికి పైగా సంపదను కలిగి ఉన్నారు. ఇందులోనూ 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలు 51 మంది ఉండటం, వారి సగటు ఆస్తి రూ. 6,542 కోట్లుగా నమోదు కావడం విశేషం. అంతేకాకుండా శ్రీమంతుల సగటు వయసు కూడా గతంలో ఉన్న 60-63 ఏళ్ల నుంచి ప్రస్తుతం 57 ఏళ్లకు పడిపోయింది. యువత వేగంగా కోటీశ్వరులవుతున్నారనేందుకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం.

Advertisement
తొలి త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ దూకుడు.. ఆదాయం 50% పెరుగుదల

కొత్త రంగాల ప్రభంజనం.. ముంబైకే ఫస్ట్ ర్యాంక్!

ఫార్మా, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ వంటి సంప్రదాయ రంగాలు ఇప్పటికీ 83 శాతం సంపదను సమకూరుస్తున్పటికీ.. రక్షణ రంగం, గ్రీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, క్విక్ కామర్స్ వంటి నయా టెక్నాలజీ రంగాలు 15.5 శాతంతో వేగంగా పుంజుకుంటున్నాయి.

ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. మన దేశపు 'వెల్త్ క్యాపిటల్'గా ముంబై తన హవాను కొనసాగిస్తోంది. జాబితాలోని 802 మంది శ్రీమంతులు ముంబై నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ 38.4 శాతం సంపదను కలిగి ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, గుర్గావ్‌లు నిలిచాయి. దేశంలోని మొత్తం సంపదలో 70 శాతానికి పైగా కేవలం ఈ 5 నగరాల్లోనే కేంద్రీకృతమై ఉందడం విశేషం.

English Summary

According to the 360 ONE Wealth Creators List 2026, India now has 3,040 individuals with a net worth above Rs 425 crore. Self-made founders have officially surpassed legacy business heirs.