తిరుమల శ్రీవారిని సన్నిధిలో అనంత్ అంబానీ.. రూ.27.5 కోట్ల భారీ విరాళం !!

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా టీటీడీకి భారీగా విరాళాలను ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, గోసంరక్షణ, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారీ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కాగా ఈరోజు వేకువజామున తిరుమలకు చేరుకున్న అనంత్ అంబానీ, శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం టీటీడీ ఈవో, ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అంతే కాకుండా అనంత్ అంబానీ తలనీలాలు సైతం సమర్పించడం విశేషం.

ananth-ambani-visited-lord-sri-venkateswara-swamy-in-tirumala-and-announced-huge-donations

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం

భక్తులకు మరింత పర్యావరణహిత రవాణా సేవలు అందించేందుకు టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు అనంత్ అంబానీ ప్రకటించారు. ఈ బస్సులు తిరుమలలో భక్తుల రవాణా కోసం వినియోగించబడనున్నాయి. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు తిరుమలలో గ్రీన్ మొబిలిటీకి మరింత ప్రోత్సాహం లభించనుంది.

50 మంది డ్రైవర్ల జీతభత్యాలు కూడా..

బస్సులు ఇవ్వడమే కాకుండా, వాటిని నడిపే 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరించనున్నట్లు ప్రకటించారు. దీంతో టీటీడీపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం తిరుమలలో అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో బస్సుల ఛార్జింగ్, నిర్వహణ సులభతరం అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కూడా ఈ మౌలిక సదుపాయం ఉపయోగపడే అవకాశం ఉంది.

టీటీడీ గోశాలకు ఆధునిక రూపం

గుజరాత్‌లో రిలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత 'వంతారా' (Vantara) ప్రాజెక్టు తరహాలో తిరుమలలోని టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు కూడా అనంత్ అంబానీ అంగీకారం తెలిపారు. గోవుల సంరక్షణ, వైద్యసదుపాయాలు, ఆధునిక మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ విరాళాలు, సేవా కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+