ఏపీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, జడ్పీల పెంపు-మేయర్, ఛైర్మన్ కు ప్రత్యక్ష ఎన్నికలు..!

ఏపీలోని స్దానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు (Chandrababu) స్వయంగా ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే 28 జిల్లాలకూ జెడ్పీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మేయర్, ఛైర్మన్లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

Amaravati: అమరావతి నాడు-నేడు..! అంబటి ఎమోషనల్ సాంగ్..!
Amaravati: అమరావతి నాడు-నేడు..! అంబటి ఎమోషనల్ సాంగ్..!

స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్‌లను వర్తింప చేస్తూ ఎన్టీఆర్ నాడు తీసుకున్న నిర్ణయం మొదలుకుని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు సభలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తున్నట్టు తెలిపారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో 34 శాతం రిజర్వేషన్‌లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించినట్టు గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌లను 24 శాతానికి కుదించడం ద్వారా 16800 మంది స్థానిక బీసీ నేతలకు రాజకీయాల్లో అవకాశాలు దక్కలేదన్నారు. ఈ 34 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు.

Chandrababu Announces 34 BC Reservation in local bodies Warns YSRCP Against Filing Cases
ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!
ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!

సుస్థిరమైన పాలన అందించడం కోసమే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపడతామని సీఎం వెల్లడించారు. ఈ మేరకు కెబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతో పాటు జిల్లాల విభజన జరిగినా ప్రస్తుతం 13 జిల్లా ప్రజా పరిషత్‌లే ఉండటంతో, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,300 కోట్ల గ్రామీణ గ్రాంట్లు, రూ.1,562 కోట్ల పట్టణ గ్రాంట్లు రావాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని, సరైన అభ్యర్థుల ఎంపిక ద్వారా భావి నాయకత్వాన్ని అందించాలని కూటమి నేతలను కోరారు. మరోవైపు తమ నిర్ణయంపై వైసీపీ కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధంగా ఉంటుందని సీఎం ఆరోపించారు. మెగా డీఎస్సీ విషయంలోనూ ఇలాగే చేశారన్నారు. ఈ రిజర్వేషన్ల విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+