ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీపై విద్యార్ధి నిరసనకారులు చేసిన దూషణలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ మరోసారి ఇన్ స్టాలోకి వచ్చి వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన.. తనపై దూషణలకు దిగిన విద్యార్ధుల్ని క్షమించేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) వ్యంగ్యంగా స్పందించారు.
కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ప్రధాని మోడీపై దుర్భాషలాడినందుకు నోయిడాకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేయడంపై వివాదం నేపథ్యంలో ఈ వీడియో చేశారు. కొంతమంది యువకులు అసభ్యకరమైన దూషణలకు పాల్పడ్డారని, నాగరిక సమాజానికి తగని పదాలను వాడారని, తనను వ్యక్తిగతంగా దూషించారని ప్రధాని ఈ వీడియోలు తెలిపారు. తన దివంగత తల్లిని కూడా నీచమైన అవమానాలకు గురిచేశారన్నారు. దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవని, వారిని శిక్షించడం, కోర్టు విచారణలకు లాగడం, లేదా వేధించడం ఇవేవీ పరిస్థితిని మార్చలేవన్నారు. తాను వారిని క్షమించాలనుకుంటున్నానని తెలిపారు. దారి తప్పిన వారికి సరైన మార్గం చూపిద్దామని మోడీ తెలిపారు.
దీనిపై కాక్రోచ్ పార్టీ నాయకుడు అభిజీత్ దిప్కే సైటైర్లు వేశారు. దేశ భవిష్యత్తు కంటే మీ చర్మం ప్రకాశవంతంగా ఉందని దీప్కే వ్యాఖ్యానించారు. మీరు వారిని రీల్‌లో మాత్రమే క్షమిస్తారా, లేక కేసులను కూడా ఉపసంహరించుకుంటారా అని ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోపై దీప్కే ప్రశ్నించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వేధిస్తున్నారని, అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని డిప్కే మరియు CJP నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తమ ఆందోళనలను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసన చేపడతామని డిప్కే హెచ్చరించారు.CJP: దేశవ్యాప్తంగా విద్యార్ధులకు కాక్రోచ్ పార్టీ సంచలన పిలుపు..! ఇకపై ప్రతీ చోటా..!