నీట్ అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టి సాధించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)పై ఇప్పుడు బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో ఆయన్ను టార్గెట్ చేస్తూనే, మరోవైపు ఆయన విదేశీ చదువులకు డబ్బులెక్కడివో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అభిజీత్ దిప్కే ఇవాళ ఓ వీడియో విడుదల చేసి దీనిపై వివరణ ఇచ్చారు.
Abhijeet Dipke: బీజేపీలో చేరకపోతే బెదిరింపులా? ప్రహ్లాద్ జోషీ, రాందేవ్ పైనా అభిజీత్ దిప్కే అటాక్..!
ఓ బీజేపీ కార్యకర్త తన విద్యాభ్యాసం ఎలా పూర్తి చేశానో తెలుసుకునేందుకు పిటిషన్ దాఖలు చేశారని అభిజీత్ దిప్కే తెలిపారు. తాను తన స్కాలర్ షిప్ లేఖతో పాటు విద్య రుణం లేఖను కూడా బయటపెట్టేందుకు సిద్దంగా ఉన్నానని, కానీ వాళ్ల నేత తన డిగ్రీ చూపించేందుకు సిద్దంగా ఉన్నారా అని అభిజీత్ ప్రశ్నించారు. వాళ్ల నేత తన అసలు డిగ్రీని చూపించగలరా అని సవాల్ విసిరారు. అయినా తన విద్యాభ్యాసంతో వీళ్లకు అంత సమస్య ఏముందని అభిజీత్ ప్రశ్నించారు.
ఓ సాధారణ మధ్యతరగతి విద్యార్ధి బోస్టన్ యూనివర్శిటికీ వెళ్ళి చదువుకుని వస్తే వీళ్లకు అంత ఇబ్బంది ఎందుకో తెలియడం లేదని అభిజీత్ దిప్కే తెలిపారు. మీరు విద్యాభ్యాసానికి ఎందుకింత వ్యతిరేకంగా ఉన్నారని ఆయన సదరు బీజేపీ కార్యకర్తను ప్రశ్నించారు. తద్వారా తన వివరాలు అడగటం మాని, ప్రధాని మోడీ డిగ్రీని బయటపెట్టాలని దిప్కే సదరు కార్యకర్తకు సూచించారు. ఇప్పటికే ప్రధాని మోడీ విద్యార్హతల వివరాలు ఇచ్చేందుకు పలు యూనివర్సిటీలు నిరాకరించాయి. సమాచార కమిషన్ కూడా ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రధాని మోడీని డిగ్రీ బయటపెట్టాలని అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది.కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!