దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కొత్త తలనొప్పి ఫేస్ చేస్తుంది. పార్టీకి చెందిన అగ్రనేతలు, ప్రజాప్రతినిధుల ఇంటి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటం మోడీ కి షాక్ గా మారింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్ ఆందోళనల ఎఫెక్ట్ తో ఇబ్బందికరమైన రాజకీయ పరిణామాన్ని ఎదుర్కొంటోంది.
ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?
విద్యార్థుల పక్షాల బీజేపీకి, మోదీకి షాక్
నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు మోడీ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నిరసనల్లో బీజేపీ నాయకుల కుమార్తెలే ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విద్యార్థుల పక్షాన రోడ్డెక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ యశస్వినీ రాజే సింగ్. ఢిల్లీలోని చారిత్రక జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆమె, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన్ని ఒక పేలవమైన జోక్‌గా అభివర్ణించారు. ఇక, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రస్తావిస్తూ... అది ఆయన చేసిన తప్పునకు పశ్చాత్తాపంలా కాకుండా, పార్టీ పెద్దలు దాన్ని ఏదో ఒక త్యాగంలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. తాను ఆర్థికంగా స్వతంత్రురాలినని, తన తండ్రి రాజకీయ నేపథ్యంతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూనే.. ప్రజాప్రయోజనాలే ముఖ్యమని ఆమె తేల్చిచెప్పారు. యశస్విని ఒక్కరే కాదు, కొద్ది రోజులుగా బీజేపీ కుటుంబ సభ్యులు ఇలాగే బాహాటంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అయిన అర్చిత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ పెను సంచలనం సృష్టించింది. నా కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్‌తో ఉంది, కానీ నేను విద్యార్థులతో ఉన్నాను అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సోషల్ మీడియా ఖాతా అదృశ్యం కావడం గమనార్హం. అసోం మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిసా మహంత సైతం నీట్ నిరసనల్లో పాల్గొన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఇంటి సభ్యులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కడంపై బీజేపీ పెద్దల్లో అంతర్మథనం మొదలైంది. దీంతో అసోం ముఖ్యమంత్రి స్పందిస్తూ... పిల్లలు పెద్దయ్యాక వారి వ్యక్తిగత ఆలోచనలకు, చర్యలకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యార్థులు భవిష్యత్తు కోసం ఆందోళనబాట పడితే, మరోవైపు సొంత పార్టీ నాయకుల బిడ్డలే వారి ఉద్యమానికి బాసటగా నిలవడం రాజకీయంగా బీజేపీకి పెద్ద సవాలుగా మారింది. అధికారంలో ఉన్న పార్టీకి, సొంత కుటుంబాల నుంచే ఇలాంటి నిరసన సెగలు తగలడం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె
తన తండ్రి రాజకీయ నేపథ్యంతో తనకు సంబంధం లేదని స్పష్టం
భోగాపురం జాతికి అంకితం - ప్రధాని మోదీ వేదికపై ప్రత్యేకంగా..!!
బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్
అసోం మంత్రి కేశబ్ మహంత కుమార్తె ఏకంగా విద్యార్థుల ఉద్యమంలో
బీజేపీకి సవాల్ గా మారుతున్న నేతల కూతుళ్ళ వ్యతిరేక గళం