bullet train: బుల్లెట్ ట్రైన్ లో ప్రమాదాలు, భూకంపం ముందే గుర్తించేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ

భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులలో హై స్పీడ్ రైలు కారిడార్లు ఒకటి. అత్యంత వేగంతో ప్రయాణం చేసే ఈ బుల్లెట్ ట్రైన్ రైలు వ్యవస్థ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ, ఏపీల గుండా ముంబై హైదరాబాద్, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

హై స్పీడ్ రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో ఏదైనా జరిగితే ఎలా?

ఈ హై స్పీడ్ రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో ఏదైనా జరిగితే ఎలా? ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరనే భావన ప్రతి ఒక్కరిలోను వ్యక్తమవుతుంది. హైస్పీడ్ రైళ్లలో సాంకేతిక లోపాలు ఏర్పడితే వాటిని గుర్తించి, అలర్ట్ చేసే వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు 320కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు భూకంపం వస్తే సెకన్లలో గుర్తించి రైలును స్వయంచాలకంగా నిలిపివేసేలా 28అధునాతన సిస్మో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

బుల్లెట్ ట్రైన్ లో విద్యుత్, సాంకేతిక లోపాలకు సెంట్రలైజ్డ్ కంట్రోల్ సెంటర్

ఇది మాత్రమే కాకుండా బుల్లెట్ ట్రైన్ లో విద్యుత్ సంబంధిత లోపాలు, సాంకేతిక సంబంధిత సమస్యలు ఏది ఎదురైనా సెంట్రలైజ్డ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్వయం చాలక వ్యవస్థ స్పందించి భద్రతను నిర్ధారిస్తుంది ఈ అధునాతన వ్యవస్థ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణం చేసేవారు అత్యంత వేగంతో ప్రయాణం చేసినప్పటికీ సురక్షితంగా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది.

దేశంలోనే మొదటిసారి 2.25 కెవి ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్

బుల్లెట్ ట్రైన్ లో దేశంలోనే మొదటిసారి 2.25 కెవి ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సాంకేతికత అధిక వేగంతో ప్రయాణం చేసే రైళ్లకు నిరంతరాయమైన స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించడానికి రూపొందించబడింది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కు సంబంధించిన పనులు జరుగుతుండగా, ఇందులో మొత్తం 508కిలోమీటర్ల దూరంలో విద్యుదీకరణ పనులు, సివిల్ నిర్మాణాలు, ట్రాక్ లేయింగ్ తో పాటు సమాంతరంగా జరుగుతున్నాయి.

Advertisement

ముంబై అహ్మదాబాద్ రైలు కోసం 14 ట్రాక్షన్ సబ్ స్టేషన్లు

ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 7 గంటల ప్రయాణ సమయాన్ని రెండు గంటల కంటే తక్కువకు తగ్గించడం లక్ష్యంగా ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. దీనికోసం మహారాష్ట్రలో ఐదు, గుజరాత్లో తొమ్మిది చొప్పున మొత్తం 14 ట్రాక్షన్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నేషనల్ పవర్ గ్రిడ్కు అనుసంధానమై విద్యుత్ సరఫరా చేస్తాయి.

మినీ మాల్దీవులుగా సోమశిల, క్రూయిజ్ విహారం.. తెలంగాణా టూరిజం నయా ప్లాన్!

దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ళ లోనూ భద్రతకు పెద్దపీట

ప్రస్తుతం రెండు నగరాల మధ్య 7 గంటల ప్రయాణ సమయాన్ని 2 గంటల కంటే తక్కువకు తగ్గించడమే లక్ష్యం. ఈ వ్యవస్థ కోసం మహారాష్ట్రలో 5, గుజరాత్‌లో 9 చొప్పున మొత్తం 14 ట్రాక్షన్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానమై విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. ఒక ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైళ్లలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న బుల్లెట్ ట్రైన్ లలో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది.

English Summary

bullet train: India’s first 2×25 kV high-speed electrification system for Mumbai-Ahmedabad Bullet Train.Advanced technology in bullet trains to detect accidents and earthquakes in advance.