తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కావేరీ జలాల (Cauvery Water) నిర్వహణ ప్రాధికార సంస్థ, కావేరీ జలాల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో కావేరీ నీటిని విడుదల చేయని కర్ణాటక చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ అధికారుల నుండి పదేపదే ఆదేశాలు వచ్చినా, నిర్ణీత పరిమాణంలో నీటిని విడుదల చేయడంలో కర్ణాటక విఫలమైందన్న కారణంతో తమిళనాడు ఈ పిటిషన్ దాఖలు చేసింది.
నేను స్కాలర్ షిప్, లోన్ వివరాలిస్తా..! చక్రవర్తి తన డిగ్రీ బయటపెడతారా ?
జూలై 28న నిర్వహించిన సమావేశంలో సీడబ్ల్యూఆర్సీ కావేరీ బేసిన్‌లోని జల, వాతావరణ పరిస్థితులను సమీక్షించింది. ఈ భేటీలోనే కృష్ణరాజ సాగర్, కబిని జలాశయాల ద్వారా జూలై 29 నుండి ఆగస్టు 12 వరకు 15 రోజుల పాటు బిలిగుండ్లు వద్ద సెకనుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.కావేరీ బేసిన్‌లో నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత జూలై 30న జరిగిన తన 54వ అత్యవసర సమావేశంలో సీడబ్ల్యూఎంఏ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. కానీ జూలై 29- ఆగస్టు 2 మధ్య బిలిగుండ్లు వద్ద నమోదైన నీటి ప్రవాహం కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల మధ్య మాత్రమే ఉందని తమిళనాడు ఆరోపిస్తోంది. ఇది నిర్దేశించిన 3,500 క్యూసెక్కుల కంటే చాలా తక్కువ.
కర్ణాటక జలాశయాలలో తగినంత నీరు అందుబాటులో ఉన్నా తమకు నీటిని విడుదల చేయడం లేదని తమిళనాడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. నిష్పత్తి ప్రాతిపదికన తమకు దక్కాల్సిన నీటి వాటాను విడుదల చేయకుండా కర్ణాటకను అడ్డుకునే ఇబ్బందులేవీ లేవని కూడా తమిళనాడు వాదిస్తోంది. కృష్ణరాజసాగర్, కబిని జలాశయాల పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల వల్ల నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో కావేరి ప్రాధికార సంస్థ ఆదేశాలను కర్ణాటక పాటించేలా చూడాలని, అలాగే నిర్ణీత గడువులోగా కావేరి నీటిలో తమకు దక్కాల్సిన వాటాను పొందేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.విద్యార్థులపై FIRల వ్యవహారం..! రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు..!