ఎన్నికల కమిషనర్ల (election commissioner)నియామకం విషయంలో గతంలో ప్రధాని, విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో ఓ కమిటీ ఉండేది. ఈ కమిటీలో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (supremme court chief justice)కేంద్రం (centre) తప్పించి ఆయన స్ధానంలో కేంద్రమంత్రిని చేర్చింది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ తంతుపై వస్తున్న ఆరోపణలపై కేంద్రాన్ని ప్రశ్నించింది. దీంతో కేంద్రం గడుసుగానే సమాధానమిచ్చింది.
విద్యార్ధులపై పెల్లెట్ల ప్రయోగంపై కేంద్రానికి సుప్రీం షాక్- ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశం..!
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్దించుకుంది. అలాగే ఈ ప్రక్రియలో ప్రధానమంత్రి పాత్రను సందేహించడానికి ఎలాంటి కారణం లేదని కూడా తేల్చేసింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే అనుమానంతో న్యాయస్థానాలు ముందుకు సాగలేవని కేంద్రం వాదించింది. ఈసీల ఎంపిక కమిటీని ప్రశ్నించడం అంటే పార్లమెంటు శాసనపరమైన వివేకాన్ని, ఎన్నికైన సంస్థలపై ఉంచిన రాజ్యాంగ విశ్వాసాన్ని శంకించడమే అవుతుందని కూడా తేల్చేసింది.
ప్రధానమంత్రి పదవికి ఒక పవిత్రత ఉంటుందని, ఆయన నిర్ణయాన్ని నమ్మలేనప్పుడు, తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసేటప్పుడు కూడా ఏదైనా మాజీ న్యాయమూర్తిని లేదా బయటి వ్యక్తిని సంప్రదించాలనే నిబంధనను ఎందుకు చేర్చకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎదురు ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 యొక్క రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కేంద్రం వాదనల తర్వతా తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు 2023లో ఈసీల నియామక కమిటీలో సీజేఐ కూడా ఉండాలంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత పార్లమెంట్ ఈ చట్టం చేసింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తుందా లేక గతంలో తమ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అంటుందా చూడాలి. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థిస్తే ఇక పార్లమెంట్ లో కేంద్రానికి చట్టం చేసే అధికారం కూడా ఉండదు.Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!