కాక్రోచ్ లకు తోడైన రైతులు..మోడీ సర్కార్ పై భారీ పోరు- సీజేపీ సంచలన ప్రకటన..!

నీట్ తో పాటు జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇవాళ మరో కీలక అడుగు వేసింది.
ఇప్పటివరకూ విద్యకు సంబంధించిన అంశాలపై తాము చేస్తున్న పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రైతుల్ని కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీజేపీ నేతలు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ (Rakesh Tikait) తో ఢిల్లీలో భేటీ అయ్యారు.

Advertisement
గంగలో చికెన్ బిర్యానీ తింటే జైలుశిక్షా ? కోర్టుల తీరుపై సుప్రీం జడ్జి ఫైర్..!
Advertisement

విద్యకు సంబంధించిన అంశాలకు మించి తమ ఉద్యమాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా, రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటుపై చర్చించేందుకు సీజేపీ నేతలు భారతీయ కిసాన్ యూనియన్ సీనియర్ నేత రాకేష్ తికాయత్ ను కలిశారు. ఈ సమావేశంలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా, ఆ సంస్థకు చెందిన పలువురు నాయకులు, అలాగే తికైత్ , భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులు మరియు యువతను ఒకే వేదికపైకి తీసుకురావడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై ఈ చర్చలు దృష్టి సారించాయని సీజేపీ ప్రకటించింది.

Advertisement

విద్యార్ధులకు సుప్రీం బిగ్ రిలీఫ్..! రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!

సమావేశం అనంతరం రంకా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత కూటమిని ఏర్పాటు చేయాలని తమ సంస్థ భావిస్తోందని చెప్పారు. దేశంలోని రైతు సోదరులు, విద్యార్థులు, యువత కలిసికట్టుగా పనిచేసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముడతారని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల మోసాల కేసులపై 36 రోజుల పాటు చేపట్టిన తమ నిరసనను సీజేపీ విరమించిన కొద్ది రోజులకే ఈ భేటీ జరిగింది. తమ విద్యా సంబంధిత డిమాండ్లతో పాటు, రైతులు, యువతకు సంబంధించిన సమస్యలను కూడా తమ ఉద్యమంలో చేర్చాలని సీజేపీ భావిస్తోంది.

Advertisement

కాక్రోచ్ మార్చ్ పై పోలీసు దాడులు, ప్రతిదాడులు..! సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!

విద్యార్థుల నిరసనల సమయంలో కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని సీజేపీ ఆరోపిస్తోంది. పలు రాష్ట్రాల్లో విద్యార్థులు చర్యలను ఎదుర్కొంటూనే ఉన్నారని, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో నిరసనకారులపై కేసులు నమోదు కాగా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలవుతున్నాయని ఆరోపిస్తోంది. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్‌కు తికాయత్ మద్దతు ఇవ్వాలని సీజేపీ నేతలు కోరారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే, రైతు సంఘాలు, యువజన బృందాలతో కలిసి దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన విద్యార్ధులకు తికాయత్ కలిసి మద్దతు ప్రకటించారు.