తమిళనాడు విద్యార్ధులకు విజయ్ గుడ్ న్యూస్..! ఇకపై చికెన్ బిర్యానీ..!

తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు సీఎం విజయ్ (CM Vijay) మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచేందుకు వీలుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తున్న మధ్యాహ్నం భోజనం మెనూలో చికెన్ బిర్యానీని కూడా చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ ప్రకటించారు.

Advertisement