పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా నీట్ పరీక్ష అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టిన కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధులు అనుకున్నది సాధించుకున్నారు. అంతకు ముందే ఇదే అంశంపై నిరాహారదీక్షకు దిగిన సోనమ్ వాంగ్ చుక్ కేంద్రంపై ఒత్తిడి పెంచడం కూడా దీనికి కారణమైంది. ఆ తర్వాత బీహార్ లోని బంకీపూర్ ఉపఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఈ పరిణామాల్ని దేశంలో మార్పుకు సంకేతంగా పలువురు భావిస్తున్నారు. ఈ కోవలో సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా చేరిపోయారు.
కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!
ఇదే క్రమంలో సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ భార్య, ఆయన విద్యాసంస్థల్ని నడుపుతున్న గీతాంజలి ఆంగ్మో (Gitanjali Angmo) కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉపఎన్నికల్లో సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ గీతాంజలి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో తాజా పరిణామాల్ని దేశంలో మార్పుకు సంకేతంగా ఆమె అభివర్ణించారు. పరిస్థితి మారుతోందా? మొదట, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో ఒక రాజీనామా. ఇప్పుడు, ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం సాధించి, బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టారంటూ ఆమె పేర్కొన్నారు.
ఒక్క ఫలితం విప్లవాన్ని సృష్టించదు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పగుళ్లు, లోపల ఏదో కదులుతోందని మనకు సూచిస్తాయని గీతాంజలి ఆంగ్మో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని కోరుకుంటోందా? చివరికి 'అచ్చే దిన్' (మంచి రోజులు) రాబోతున్నాయా? అని గీతాంజలి ఆంగ్మో ప్రశ్నిస్తూనే జోస్యం చెప్పారు. సోనమ్ వాంగ్ చుక్ రాజీనామా కారణంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్ధితి ఎదురైన విషయాన్ని పరోక్షంగా గీతాంజలి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ రాజీనామాతో దేశంలో మంచి రోజులు రాబోతున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.పీకే విజయం వెనుక కీలక కారణాలు- కాక్రోచ్ పోరు టూ కులాల లెక్కల గల్లంతు వరకూ.!