బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ స్ధానానికి రాజీనామా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకోవచ్చని బీజేపీ కూడా భావించింది. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అభ్యర్ధుల్ని మాత్రమే బరిలోకి దించి, గెలిపించుకోవడంలో విఫలమైన జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బంకీపూర్ లో బరిలోకి దిగాలని నిర్ణయించారు. అయినా బీజేపీ లైట్ తీసుకుంది. మంత్రి నరోత్తమ్ మిశ్రాను అభ్యర్ధిగా ప్రకటించి, ఆ తర్వాత మార్చి మరో యువ నేతను బరిలోకి దింపింది. అయినా పీకే విజయాన్ని అడ్డుకోలేకపోయింది. అయితే ప్రశాంత్ కిషోర్ విజయం వెనుక ఉన్న ఇదొక్కటే కాదు చాలా కారణాలున్నాయి.
ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం..! కుక్కను దించినా గెలుస్తామన్న బీజేపీకి భారీ షాక్..!
కాక్రోచ్ పార్టీ నిరసనల్ని అందుకున్న పీకే(Prashant Kishor)
బంకీపూర్ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగినప్పుడు ఆయన గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. కనీసం అధికార బీజేపీకి పోటీ ఇస్తారా అని మాత్రమే ఆలోచించారు. కానీ అదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున జరిగిన నిరసనల ప్రభావం బీహార్ పైనా పడింది. రాష్ట్రంలోనూ యువత రోడ్లెక్కారు. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా గళమెత్తారు. లాఠీ దెబ్బలు తిన్నారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. యువత ఆకాంక్షల్ని గౌరవించని బీజేపీపై విమర్శలు మొదలుపెట్టారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీకే మాటల్ని జనం కూడా నమ్మారు. అప్పటికే ఆర్జేడీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్దిని మళ్లీ బరిలోకి దించినా పట్టించుకోలేదు. దీంతో కాక్రోచ్ ల నిరసన ప్రశాంత్ కిషోర్ విజయానికి బాగా కలిసొచ్చింది.
కాక్రోచ్ ల నిరసనకు తోడు రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో జరిగిన మార్పులు కూడా పీకేకు కలిసి వచ్చాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ కుమార్ ను తప్పించి టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదని పీకే నిత్యం విమర్శించే సామ్రాట్ చౌదరిని బీజేపీ సీఎంని చేసింది. అదే సమయంలో కాక్రోచ్ నిరసనల్లోనూ ఇదే విషయం ప్రధానంగా మారింది. అలా పీకే వాదనకు బలం చేకూరింది. అంతగా విద్యావంతుడు కాని సామ్రాట్ చౌదరిపై వ్యతిరేకత కూడా బంకీపూర్ లో పీకేకు కలిసి వచ్చింది. యువత, ఇతర వర్గాలు ఇతర సమీకరణాలు ఏవీ పట్టించుకోకుండా పీకేను బలపరిచాయి. అలాగే కాక్రోచ్ నిరసనల్ని హ్యండిల్ చేయడంలో బీజేపీ వైఫల్యం ఆ పార్టీ అభ్యర్దికి శాపంగా మారింది. దీంతో పీకే విజయం నల్లేరుపై నడకే అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ముస్లిం-యాదవ ఓటు బ్యాంక్ పై అతిగా ఆధారపడిన ఆర్డేడీ అధికారం అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఇప్పుడు బంకీపూర్ ఉపఎన్నికల్లోనూ ఆర్జేడీ నిలబెట్టిన అభ్యర్దికి ముస్లిం-యాదవ ఓటు బ్యాంక్ అండగా నిలవలేదు. కుల సమీకరణాల కంటే యువత ఆకాంక్షలే ప్రధానంగా జరిగిన ఈ ఎన్నికల్లో పీకే అభివృద్ది అజెండాకే జనం ఓటేశారు. దీంతో కుల సమీకరణాలతో అలరారే బీహార్ లో తొలిసారి యువత ఆకాంక్షలు, అభిృద్ధికే జనం పట్టం గట్టారు. అందుకే పీకే ఇంత సులువుగా గెలిచారు.ప్రశాంత్ కిషోర్ భారీ విజయం వెనుక కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం?
బీజేపీ వైఫల్యాలు
నేను స్కాలర్ షిప్, లోన్ వివరాలిస్తా..! చక్రవర్తి తన డిగ్రీ బయటపెడతారా ?
ఆర్జేడీ ముస్లిం-యాదవ ఓట్ బ్యాంక్ గల్లంతు