ఈ నెల 20న నీట్ పరీక్షలో అక్రమాలను నిరసిస్తూ విద్యార్ధులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నుంచి నిర్విహించిన పార్లమెంట్ మార్చ్ ను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ తో పాటు భాష్పవాయువు ప్రయోగాలు, పెల్లెట్ల వాడకం కూడా చేశారు. ఇప్పుడు అవే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే పార్లమెంట్ ను కుదిపేస్తుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) కూడా విద్యార్థులపై పిటిషన్ల విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తీరును ఆక్షేపించింది. అదే సమయంలో కేంద్రానికీ నోటీసులు ఇచ్చింది.
జంతర్ మంతర్ వద్ద విద్యార్దులపై పెల్లెట్ గన్ల ప్రయోగంపై దాఖలైన కేసులో పోలీసు నిబంధనల ప్రకారం అటువంటి బలప్రయోగానికి అసాధారణ పరిస్థితులలో మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రికార్డులో ఉంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. గుంపు నియంత్రణ పరిస్థితులలో బలప్రయోగం యొక్క దశలను నిర్దేశించే స్థాయీ ఉత్తర్వులను ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో పెల్లెట్ గన్‌ల వాడకం సమర్థనీయమా కాదా అని పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోర్టు తెలిపింది.
అసంతృప్తిని వ్యక్తం చేసేవారిపై లేదా నిరసన తెలిపేవారిపై హింసకు పాల్పడకూడదన్న పిటిషనర్ల అభ్యర్థనతో ఏకీభవిస్తున్నామని, అయితే, కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రతను బట్టి తగిన స్థాయి చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పోలీసు సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడం ఉత్తమ మార్గమని, అది వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా లాఠీతో వస్తుంటే, మీరు స్పందించే ముందు మరో క్షణం ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా గుర్తుచేసింది. నిరసనల సమయంలో మెటాలిక్ పెల్లెట్ గన్‌ల వాడకాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వులు అనుమతించవని పిటిషనర్లు వాదించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నిబంధనల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీసుల చర్యపై విద్యార్ధులు న్యాయ సమీక్ష కోరుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ పోలీసులు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన పిటిషనర్‌కు, అలాగే నిరసన సమయంలో గాయపడిన ఇతర వ్యక్తులకు అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందేలా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం .. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌ను ఆదేశించింది.కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!
కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!