ప్రధాని మోడీకి జుకర్ బర్గ్ సారీ..! వీడియో డిలీట్ తో పాటు వీటిపై..!

కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల సందర్భంగా జెన్ జీని ఉద్దేశించి ప్రధాని మోడీ (pm modi) చేసిన వీడియోను ఫేస్ బుక్ లో తాత్కాలికంగా డిలీట్ చేసి, తిరిగి పెట్టిన వ్యవహారంలో కేంద్రం ఆగ్రహంతో మెటా దిగొచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) సారీ చెప్పాల్సిందేనని కేంద్రం పట్టుబట్టడంతో ఆయన ఇవాళ క్షమాపణలు చెప్పారు. ప్రధాని వీడియో డిలీట్ చేసిన వ్యవహారంతో పాటు మెటా ప్లాట్ ఫామ్స్ లో అభ్యంతర కంటెంట్ విషయంలోనూ ఆయన సారీ చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మెటాకు కేంద్రం భారీ షాక్- జుకర్ బర్గ్ కు 3 రోజుల అల్టిమేటం..!

ప్రధాని మోడీ డిలీట్ తో పాటు చిన్న పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ ను మెటా ప్లాట్ ఫామ్స్ పై అనుమతిస్తున్న వ్యవహారంపై క్షమాపణలు చెప్పాలని లేదంటే చర్యలకు సిద్దం కావాలంటూ మార్క్ జుకర్ బర్గ్ కు పార్లమెంట్ కమిటీ మూడు రోజుల అల్టిమేటం ఇచ్చింది. అయితే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని భావించిన మెటా.. ముందుగా తమ ప్రతినిధుల్ని ఇవాళ ప్రభుత్వానికి వివరణ ఇచ్చేందుకు పంపింది. అనంతరం స్వయంగా జుకర్ బర్గ్ రాతపూర్వకంగా క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ దేశంతో భూభాగం మార్చుకోబోతున్న భారత్..! సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!

కేంద్రంతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల సందర్భంగా బాలల లైంగిక వేధింపుల సామగ్రి, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తికి , కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించడంలో ఉన్న లోపాలకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది.ఈ చర్చలలో మెటా జవాబుదారీతనం, కంటెంట్ నియంత్రణకు సంబంధించిన పలు అంశాలపై దృష్టి సారించినా, ప్రధాని మోడీ వీడియో తొలగింపు వ్యవహారంపై ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. చర్చల్లో కంటెంట్ నియంత్రణలో జరిగిన తప్పులను మెటా అంగీకరించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లలో హానికరమైన కంటెంట్‌ను ఉంచుతున్న తీరుపై విచారం వ్యక్తం చేసింది. ఏ కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేసి వినియోగదారులకు చూపించాలో తమ అల్గారిథమ్‌లే నిర్ణయిస్తాయి కాబట్టి ఐటీ చట్టం కింద మధ్యవర్తులకు లభించే చట్టపరమైన రక్షణను మెటా పొందలేదని కూడా ప్రభుత్వ అధికారులు తెలిపారు.