SIR లో పేరు లేకపోతే పాస్ పోర్టు కూడా..! తేల్చేసిన కలకత్తా హైకోర్టు...!

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) కార్యక్రమంలో ఓటు తీసేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నిరూపించే ఘటనలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ లో పేరు తీసేసిన ఓ వ్యక్తికి ఆ తర్వాత 16 డాక్యుమెంట్లు సమర్పించినా పౌరుడిగా గుర్తించేందుకు నిరాకరిస్తూ తాజాగా గౌహతి హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు కలకత్తా హైకోర్టు కూడా పాస్ పోర్టు(Passport)కు నిరాకరిస్తూ దాదాపు ఇలాంటి తీర్పు ఒకటి వెలువరించింది.

Advertisement

పశ్చిమబెంగాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు కోటి మంది ఓటర్లను తొలగించింది. వీరంతా ఇప్పుడు ప్రత్యేక ట్రైబ్యునళ్ల ముందు పోరాటాలు చేస్తున్నారు. అయితే ఆలోపే వీరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరాకరిస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తికి పాస్ పోర్టు కూడా నిలిపేయడంతో అతను కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ముందు పౌరసత్వం సంగతి తేల్చాల్సిందేనంటూ అతని వాదనను తోసిపుచ్చింది.

Advertisement

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుండి పేరు తొలగించబడటంతో పాస్‌పోర్ట్ దరఖాస్తు నిలిపేసిన వ్యక్తికి ఉపశమనం కల్పించడానికి కలకత్తా హైకోర్టు జల్పాయ్ గురి సర్క్యూట్ బెంచ్ నిరాకరించింది. ముందుగా అతని పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని తేల్చాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. దీంతో అతను తన పౌరసత్వ నిరూపణ కోసం ఎస్ఐఆర్ ట్రైబ్యనల్ ను ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అక్కడ అతను పౌరుడిగా నిరూపించుకుంటే అప్పుడు పాస్ పోర్టు లభించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.