ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్ - జపాన్ దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర నమ్మకమే అతిపెద్ద ఆస్తి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జూలై 1 నుంచి 3 వరకు భారతదేశానికి విచ్చేసిన జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయే తకైచితో హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆటోమొబైల్ నుండి ఎలక్ట్రానిక్స్ రంగం వరకు భారత్ వృద్ధిలో జపాన్ ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని, నేటి తకైచి పర్యటనతో ఈ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్-జపాన్ రక్షణ సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా ఇరు దేశాలు తొలిసారిగా సంయుక్త అభివృద్ధి (Co-development) ప్రాజెక్టుపై సంతకాలు చేశాయి. ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీ జపాన్ ప్రధాని సనాయే తకైచి మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యవహారాలు గందరగోళంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, జపాన్ దేశాలు తమ సొంత బలాలను ఉపయోగించుకుంటూ మరింత బలంగా, సంపన్నంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు సముద్ర భద్రతా సహకారాన్ని విస్తరించడం చాలా ముఖ్యమని ఆమె నొక్కిచెప్పారు. ఖమేనీ అంత్యక్రియలకు మోదీ దూరం.. ఎందుకంటే! భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య బంధం 1952లో ప్రారంభం కాగా, 2014లో ప్రధాని మోదీ.. అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే హయాంలో ఇది 'స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్'గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతిక రంగాలలో 70కి పైగా చర్చా యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఇటీవలే 2026 జూన్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా, అంతకుముందు 2025 నవంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమిట్ వేదికగా కూడా మోదీ, తకైచి సమావేశమై పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. తాజా పర్యటనతో ఇరు దేశాల మధ్య రక్షణ బంధం మరింత ఉక్కుపిడికిలిగా మారబోతోందని స్పష్టమవుతోంది.రక్షణ రంగంలో చారిత్రాత్మక మైలురాయి
ప్రధాని మోదీ నా 'పెద్దన్న'.. జపాన్ పీఎం ప్రశంసలు
నిరంతర చర్చలు.. పటిష్ట బంధం