కేతన్ హత్యకేసులో పోలీసులకు కోర్ట్ షాక్!

పూణేకు చెందిన యువ రియల్టర్ హత్యకేసు కీలకమలుపు తిరుగుతుంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కేతన్ హత్యకు సంబంధించి కేతన్ ను లోహ గడ్ కోటపై నుండి క్రిందికి తోసింది ఎవరు అన్నది ఇప్పటివరకు అంతుచిక్కని ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఈ క్రమంలో పోలీసులు సియా మరియు చేతన్ లకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

లై డిటెక్టర్ పరీక్షలకు సియా, చేతన్ నో

లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే అసలు ఎవరు కేతన్ ను హతమార్చారు అనే విషయం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కానీ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలంటే నిందితుల ముందస్తు అనుమతి కావాలి. ఇక ఇదే విషయాన్ని సియా తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు నిందితులకు ఈ మేరకు నోటీసులు జారీ చేయగా, సియా, చేతన్ ఇద్దరూ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అంగీకరించలేదు.

Advertisement

కేతన్ ను హతమార్చే ప్లాన్ లోనే మొదటినుండి సియా

వారి సమ్మతి లేకుండా నిజనిర్ధారణ పరీక్ష నిర్వహించవద్దని కోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప లై డిటెక్టర్ పరీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. ఇక మరోవైపు సియా కేతన్ ను హతమార్చాలని ప్లాన్ తోనే ఉన్నట్టుగా ఆమె తన స్నేహితురాలికి పంపిన స్నాప్ చాట్ మెసేజ్ లో స్పష్టంగా ఉంది.

జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేస్తున్నానంటూ ఫ్రెండ్ కి మెసేజ్

సియా తన స్నేహితురాలిని పెళ్లికి ఆహ్వానిస్తూ, అతిధులకు ఇచ్చే ఎంట్రీ టికెట్ బుక్ చేయడానికి ఆధార్ కార్డు పంపాలని కోరింది. అసలు జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేస్తున్నానంటూ అందులో నిందితురాలు పేర్కొన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేతన్ ను పెళ్లి చేసుకోకూడదు ఎలాగైనా వదిలించుకోవాలని సియా ప్రయత్నిస్తుంది అని చెప్పడానికి ఆధారం దొరికినట్లు అయింది.

Advertisement

చేతన్ ఫ్రెండ్ కి హత్యతో సంబంధం

అంతేకాదు ఈ కేసులో నిందితుల ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను సేకరించిన పోలీసులు అందులో కోడ్ భాషలో మాట్లాడుకున్న చాట్ ను డీకోడ్ చేస్తున్నారు. ఇక ఈ హత్యతో చేతన్ స్నేహితుడికి సంబంధం ఉందని భావించి అతనిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

సియా దాచిన ఇంకో ఫోన్ నుండి సమాచారం సేకరిస్తున్న పోలీసులు

ఇక ఇప్పటి వరకు ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన సియా ఇంకొక మొబైల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ పరీక్షకు పంపి ఈ మొబైల్ లోని డేటాను కూడా సేకరించి మరిన్ని ఆధారాలను ఈ కేసులో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

English Summary

Pune murder : In a major development in the Ketan Agarwal murder case in Pune, accused Siya Goyal and Chetan Chowdary have refused to undergo the lie detector (polygraph) test. The court ruled that the test cannot be conducted without their consent.