గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో కలిపి ప్రవేశపెట్టిన బీజేపీ.. దాన్ని నెగ్గించేందుకు అవసరమైన 2/3 వంతు మంది ఎంపీల మద్దతు సాధించలేకపోయింది. దీని వెనుక తమిళనాడుకు చెందిన ఎంపీలు కీలక పాత్ర పోషించారు. అందులోనూ అప్పటి అధికార పక్షం, ప్రస్తుతం విపక్షంలో ఉన్న డీఎంకే ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. అయితే ఇప్పుడు తమిళనాడులో పరిస్ధితులు మారాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కాదని విజయ్ ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది.
కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!
దీంతో డీఎంకే ఎంపీలు ఈసారి కచ్చితంగా తమకు మద్దతుగా నిలుస్తారనే అంచనాతో డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెస్తోంది. టీఎంసీ, ఆప్, శివసేన పార్టీల్ని చీల్చి, ఆ ఎంపీల మద్దతు కూడా కలుపుకుని డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) రంగంలోకి దిగారు. విజయ్ కు తాము మద్దతివ్వడంపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఉద్దేశించి ఇవాళ ఓ కీలక పిలుపునిచ్చారు. పైకి మాత్రం అన్ని తమిళ పార్టీలకూ, ఎంపీలకు అని రాహుల్ పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, తమిళనాడు ప్రజల ఓటు హక్కును ,, అధికారాన్ని హరించడమే ఈ పునర్విభజన ఉద్దేశమని, ఇది బీజేపీ పన్నాగమని రాహుల్ గాంధీ ఇవాళ ఆరోపించారు. పునర్విభజనకు మద్దతు ఇచ్చే ఎవరైనా తమిళనాడుకు ద్రోహం చేస్తున్నట్లే అన్నారు. వారు తమిళనాడు భవిష్యత్తుకు ద్రోహం చేస్తున్నారని, తమిళనాడు ప్రజలపై, ఆ రాష్ట్ర భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఇది 21వ శతాబ్దపు దాడి అన్నారు. ఏ తమిళుడూ ఈ పునర్విభజనకు మద్దతు ఇవ్వకూడదన్నారు. ప్రతి తమిళుడూ దీనిని వ్యతిరేకించాలన్నారు. ప్రతి తమిళ పార్టీ, అలాగే ప్రతి జాతీయ పార్టీ కూడా సభలో ఈ పునర్విభజనను ఓడించాలన్నారు.కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!