CJP: దేశవ్యాప్తంగా విద్యార్ధులకు కాక్రోచ్ పార్టీ సంచలన పిలుపు..! ఇకపై ప్రతీ చోటా..!

నీట్ పరీక్షలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టి నిరసనలతో ఆయన్ను గద్దె దింపిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇప్పుడు ఆ వేడిని దేశమంతా రగిల్చేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా విద్యార్ధులకు ఇవాళ కీలక పిలుపునిచ్చింది. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా(Ashutosh Ranka) ఎక్స్ లో విద్యార్దులనుద్దేశించి ట్వీట్ చేశారు.

Advertisement
కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!
Advertisement

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్ధులు విద్యా సౌకర్యాల కోసం రోడ్డెక్కుతున్నారు. దీంతో విద్యా ఉద్యమం జెన్ జీ నుంచి జెన్ ఆల్ఫాకు చేరుకుందన్న వాదన కూడా మొదలైంది. గత రెండు రోజుల్లోనే రాజస్థాన్ తో పాటు పలు చోట్ల విద్యార్ధులు తమ స్కూల్లో టీచర్లు లేరని, సౌకర్యాలు లేవని ఆరోపిస్తూ నిరసనలకు దిగుతున్నారు. దీంతో వారికి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా విద్యార్ధులు స్కూళ్లలో, కాలేజీల్లో, యూనివర్శిటీల్లో విద్యా సౌకర్యాలపై గొంతెత్తాలని కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు, ఉపాధ్యాయులు మెరుగైన సౌకర్యాలు, మంచి విద్య కోసం వారి వారి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో గళం విప్పాలని కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ట్వీట్ చేశారు. అలాంటి ప్రతి పోరాటంలోనూ, కాక్రోచ్ జనతా పార్టీ వారికి దృఢంగా అండగా నిలుస్తుందని తెలిపారు. మంచి విద్య అనేది విలాసం కాదు, అది మన హక్కు అంటూ ఆయన స్పష్టం చేశారు.