పశ్చిమబెంగాల్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం తర్వాత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ ఎత్తున బీజేపీ బాట పట్టారు. దీంతో తృణమూల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కుదేలవుతోంది. అలాగే పార్టీకి రెబెల్స్ గా మారిన వారంతా తాము వెళ్లిపోవడానికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే కారణమన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) స్పందించారు. రెబెల్స్ కు ఘాటు సవాల్ విసిరారు.
మోడీ బిగ్ ప్లాన్ ? ఒకటే ఎన్సీపీ..! తర్వాతే ఎన్డీయేలోకి..!
తన వల్లే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, తన మేనత్త మమతా బెనర్జీని వీడుతున్నట్లు చెప్పుకుంటున్న రెబెల్స్ కు అభిషేక్ బెనర్జీ ఓ సవాల్ విసిరారు. పార్టీని వదిలిపెట్టి, ఇప్పుడు నన్ను దూషిస్తున్న లేదా నిందిస్తున్న వారికి తాను ఓ సవాలు విసురుతున్నానని, వారు తిరిగి 'దీదీ' (మమతా బెనర్జీ) దగ్గరకు రావాలని సూచించారు. ఒకవేళ వారు అలా చేస్తే తాను గంటలోపే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ వారు అలా చేయరని కూడా అభిషేక్ తేల్చిచెప్పేశారు.
రెబెల్స్ బీజేపీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని, పార్టీని వదిలిపెట్టడం, రెబల్ వర్గంలో లేదా బీజేపీలో చేరడం, ఈడీ (ED) , సీబీఐ (CBI) వంటి సంస్థల నుండి రక్షణ పొందడం దీని వెనుక ఉన్న ఉద్దేశం అని అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఆపై అభిషేక్ బెనర్జీని నిందించడం, దూషించడం వారి వ్యూహంలో భాగమన్నారు. కాబట్టి రెబెల్స్ బెదిరింపులకు బెదిరేది లేదంటూ మమతా బెనర్జీ మేనల్లుడు తేల్చిచెప్పేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ కూడా రెబెల్స్ విషయంలో కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు.టీఎంసీ రెబెల్స్ కు మమత తాజా వార్నింగ్..! రీఎంట్రీపై క్లారిటీ..!
హైకోర్టులో అడ్డంగా బుక్కయిన విజయ్ సర్కార్- 100 కోట్ల ఆలయ స్కాంలో..!