Monsoon: ఎల్ నినో లెక్కలు తారుమారు..! 2 వారాలు పండగే..! తాజా అంచనా..!

ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో (EL nino) ప్రభావంతో భారతదేశంలో రుతుపవనాలు మందగించడంతో వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు అంతర్జాతీయ వాతావరణ విభాగం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రాబోయే రెండు వారాల పాటు నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మరింత చురుగ్గా కదలబోతున్నాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు ఎంతో అనుకూలంగా మారాయని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు వెల్లడించారు.

Advertisement
El Nino: చావు కబురు చల్లగా చెప్పిన ఐఎండీ- ఆగస్టులో వర్షాలపై తాజా అప్డేట్..!
Advertisement

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చనుంది. ప్రస్తుతం దేశంలోని ఉత్తరాది, తూర్పు రాష్ట్రాలలో స్వల్ప కాలం పాటు ఉండే అనేక వర్షపాత వ్యవస్థలు బాగా చురుగ్గా మారాయి. దీనికి తోడు అంతర్జాతీయ వాతావరణ వ్యవస్థ అయిన మ్యాడెన్-జూలియన్ ఆసిలేషన్ బంగాళాఖాతం దక్షిణ భాగంలో మేఘాల రవాణాకు, మేఘాల పుట్టుకకు కారణమవుతోంది. ఈ రెండు విభిన్న వాతావరణ పరిస్థితులు ఒకేసారి తోడవడంతో రాబోయే 15 రోజుల్లో దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో వర్షాల జోరు గణనీయంగా పెరగనుంది.

Advertisement

Super El Nino :

సముద్రపు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రస్తుతం తటస్థంగా కొనసాగుతోంది. అయితే, రాబోయే రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో మరింత ఊపందుకుంటే, అది హిందూ మహాసముద్రంలో సానుకూల వాతావరణ మార్పులకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎల్ నినో కలిగించే వర్షాభావ పరిస్థితుల తీవ్రత తగ్గి, భారతీయ ఉపఖండంలో మంచి వర్షాలు కురిసేందుకు మార్గం సుగమం అవుతుందని అంచనా. ఈ ఏడాది వర్షాకాల సీజన్ ముగింపు ఎలా ఉండబోతుందో నిర్ణయించడంలో ఈ పదిహేను రోజులే కీలకంగా మారబోతున్నట్లు అంచనా. ఈ ఊహించని రుతుపవన మార్పుల వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.