విద్యార్థులపై FIRల వ్యవహారం..! రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు..!

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో విద్యార్దులు రోడ్డెక్కారు. ముఖ్యంగా జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ కు సంఘీభావంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. దీంతో విద్యార్ధులు ఆయా కేసుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాక్రోచ్ పార్టీ కూడా కేంద్రాన్ని ఈ కేసులు ఎత్తేయాలని పదే పదే కోరుతోంది. ఈ నేపథ్యంలో గందరగోళంలో ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ స్పష్టత ఇచ్చింది.

Advertisement
కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!
Advertisement

విద్యార్దులపై నమోదు చేసిన కేసుల్ని వెనక్కి తీసుకోవడం లేదా మూసేసే విషయంలో పలు రాష్ట్రాలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. దీంతో ఆయా చోట్ల ఇంకా విద్యార్దులపై కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇవాళ రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది. కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ పిలుపు మేరకు నిరసనలు చేసిన విద్యార్దులపై కేసుల ఎత్తివేత, ఉపసంహరణ విషయంలో రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో అప్పట్లో నిరసనలకు దిగిన విద్యార్ధులకు భారీ ఊరట లభించినట్లయింది.

CJP: దేశవ్యాప్తంగా విద్యార్ధులకు కాక్రోచ్ పార్టీ సంచలన పిలుపు..! ఇకపై ప్రతీ చోటా..!

ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా కేంద్రం గతంలో తాము కాక్రోచ్ పార్టీ ప్రతినిధులకు ఇచ్చిన హామీల విషయంలో చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. అనంతరం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. నేర చరిత్ర లేని పక్షంలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోకుండా నిరోధిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశం యొక్క పరిధిని కూడా స్పష్టం చేసింది. అత్యాచారం, ఇతర ఘోరమైన నేరాలతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ రక్షణ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ముందుగా గుర్తించి, వర్గీకరించవచ్చని, ఆ తర్వాత అధికారులు ప్రతి కేసులోనూ తగిన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించవచ్చని కూడా ధర్మాసనం సూచించింది.