ఎమ్మెల్యే కాకుండానే రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎంపీలు కాకుండానే కేంద్రమంత్రులుగా , ప్రధానమంత్రులుగా గతంలో ఆరు నెలల లోపు కొనసాగిన రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కాకుండానే ఓ రాష్ట్రంలో మంత్రి కావడమే కాకుండా, ఆరు నెలలు దాటిపోయినా అదే పదవిలో కొనసాగడం మాత్రం బీహార్ లో జరిగింది. ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్లకు ఊరట..! సుప్రీం సంచలన తీర్పు..!
బీహార్ ఎన్డీయే ప్రభుత్వంలో దీపక్ ప్రకాష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 15న సీఎంగా నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకునే సమయానికి దీపక్ ప్రకాష్ నాలుగు నెలల 26 రోజుల పాటు పంచాయతీ రాజ్ మంత్రిగానే ఉన్నారు. ఆ తర్వాత 22 రోజుల పాటు ఏ మంత్రి పదవిలోనూ లేరు. తిరిగి మే 7న నితీష్ కుమార్ స్ధానంలో సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇందులోనూ దీపక్ ప్రకాష్ కు పంచాయతీ రాజ్ మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి రెండు నెలలకు పైగా ఆయన మంత్రి పదవిలో ఉన్నారు.
దీంతో రెండు ప్రభుత్వాలు కలిపి ఆయన ఎమ్మెల్యే కాకుండానే ఆరు నెలలకు పైగా మంత్రి పదవిలో ఉన్నట్లయింది. ఇలా దీపక్ ప్రకాష్ ను మంత్రిగా కొనసాగించడం రాజ్యాంగాన్ని మోసం చేసినట్లేనని, దాన్ని చెల్లదిగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. తప్పనిసరిగా ఆరు నెలల పాటు పదవిలో కొనసాగిన తర్వాత కూడా, ఎన్నిక కాకుండా ఒక మంత్రి ఎలా పదవిలో కొనసాగుతున్నారో వివరించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది పూర్తిగా చట్టపరమైన ప్రశ్న అని, ఎన్నిక కాకుండా ఒక మంత్రి ఆరు నెలలకు పైగా ఎలా కొనసాగుతున్నారో ప్రభుత్వం వివరించాల్సి ఉంటుందని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ కేసును ఆగస్టు 4న అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.విద్యార్ధులపై పెల్లెట్ల ప్రయోగంపై కేంద్రానికి సుప్రీం షాక్- ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశం..!