దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు (Digital Arrest) స్కాంలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ మరోసారి తీవ్రంగా స్పందించింది. వీటిని అరికట్టే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తో పాటు రాష్ట్రాలకూ కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఖాతాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రామాణిక విధానం రూపొందించి నాలుగు వారాల్లో తమకు సమర్పించాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రాలు కూడా ఇకపై ఈ-జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలు చేయాలని ఆదేశించింది.
కాక్రోచ్ మార్చ్ పై పోలీసు దాడులు, ప్రతిదాడులు..! సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!
డిజిటల్ అరెస్టులు జరిగినప్పుడు సైబర్ మోసాల ఫిర్యాదులు, డబ్బు పునరుద్ధరణ యంత్రాంగాలను అమలులోకి తీసుకురావాలని, వీటిపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఉమ్మడి బాధ్యత, బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. దేశంలో డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలకు సంబంధించి సంబంధిత శాఖల నుండి సమన్వయంతో కూడిన ప్రతిస్పందనను కోరుతూ గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై ఆయా ప్రతివాదులు దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ లను పరిశీలించి ఇవాళ తాజా ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దాఖలు చేసిన నాల్గవ స్టేటస్ రిపోర్ట్, మే 11, జూలై 14న జరిగిన అంతర్-విభాగాల కమిటీ నాలుగో, ఐదవ సమావేశాలలో జరిగిన చర్చలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు , మధ్యవర్తులు తీసుకున్న చర్యల గురించి వివరాలు తీసుకున్న సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అందిన ఫిర్యాదుల సంఖ్య 2024లో 1,23,672 నుండి 2025లో 58,249కి గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది జూన్ 30 నాటికి ఇది 16,377కి క్షీణించినట్లు కేంద్రం తమ నివేదికలో తెలిపింది. అలాగే మోసం జరిగిన డబ్బు మొత్తాలు కూడా తగ్గాయి. అయినా సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్టులపై కఠినంగా స్పందించాలని ఆర్బీఐతో పాటు రాష్ట్రాలకూ ఆదేశాలు ఇచ్చింది.సుప్రీం మెట్లెక్కిన విజయ్..! కర్ణాటకతో ఇక తాడో పేడో..!