దళపతికి షాక్: కాన్వాయ్ కట్, నో సెక్యూరిటీ!

తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే వార్తలతో నిన్నటి వరకు కోలాహలంగా ఉన్న ఆయన నివాసం 'నీలాంగరై'.. ఇప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడం, మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో

ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా భావించి, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నీలాంగరైలోని ఆయన నివాసం వద్ద మూడంచెల భద్రతతో పాటు, విజయ్ ఎక్కడికి వెళ్లినా భారీ పోలీస్ కాన్వాయ్ నీడలా వెంట ఉండేది. కనీసం ఆయన ఇంటి వీధిలోకి కూడా ఎవరినీ అనుమతించేవారు కాదు. కానీ, బుధవారం రాత్రి సీన్ మొత్తం మారిపోయింది. విజయ్ పోలీస్ కాన్వాయ్‌ను ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ప్రస్తుతం ఆయన వద్ద కేవలం వ్యక్తిగత భద్రతా సిబ్బంది (Personal Security) మాత్రమే మిగిలారు. ఆయన ఇంటి వద్ద ఉన్న బారికేడ్లను, పోలీస్ పహారాను తొలగించడంతో ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది.

Vijay s Security Withdrawn Police Convoy Removed Amid Tamil Nadu Government Formation Deadlock Neelankarai Dull
కాబోయే సీఎం 'పీఏ'ను నడి రోడ్డుపై కాల్చి చంపేశారు!
కాబోయే సీఎం 'పీఏ'ను నడి రోడ్డుపై కాల్చి చంపేశారు!

ద్రవిడ పార్టీల 'చక్రవ్యూహం'.. దళపతికి చెక్!

విజయ్‌కు సీఎం కుర్చీ దక్కకుండా అటు డీఎంకే (DMK), ఇటు అన్నాడీఎంకే (AIADMK) తెరవెనుక పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల వైరాగ్యాన్ని పక్కనపెట్టి, విజయ్‌ను అధికారానికి దూరం చేసేందుకు ద్రవిడ పార్టీలు ఏకమయ్యాయనే వార్తలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. సంఖ్యాబలం విషయంలో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, దానికి తోడు ప్రభుత్వ భద్రతను ఉపసంహరించుకోవడం చూస్తుంటే.. విజయ్‌ను రాజకీయంగా ఒంటరిని చేసేందుకు పెద్ద స్కెచ్‌ పడిందని టీవీకే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

DMK తో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన
DMK తో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన

నీలాంగరైలో నిశ్శబ్దం.. గంట గంటకూ ఉత్కంఠ!

నీలాంగరైలోని కాసువారినా డ్రైవ్ వీధిలో ఉన్న విజయ్ నివాసం ఇప్పుడు భద్రతా సిబ్బంది లేక ఖాళీగా కనిపిస్తోంది. మెజారిటీ కోసం మద్దతు కూడగట్టే పనిలో విజయ్ టీమ్ బిజీగా ఉన్నప్పటికీ, పోలీసుల ఉపసంహరణ నిర్ణయం వారిని ఆత్మరక్షణలో పడేసింది. అటు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పూర్తిస్థాయి ఎమ్మెల్యేల జాబితా కోరడం.. ఇటు ద్రవిడ పార్టీలు వ్యూహాలు మార్చడంతో.. విజయ్ 'కోట' చేరుకుంటారా? లేక ప్రతిపక్షానికే పరిమితమవుతారా? అన్నది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+