ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ.. బాత్ రూమ్ పక్కనే ఉంటే బెటర్ !!

ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతుండటంతో, ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల్లోనే ఇంటికే వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే ప్రశాంతంగా సినిమా చూడటానికి మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర భాషల్లోని సినిమాలు, సిరీస్ లను కూడా సబ్ టైటిల్స్ తో చూసి మరీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు గానే సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలు సైతం వస్తున్నాయి. కాగా ఈ వేసవిలో స్టార్ హీరోల భారీ సినిమాలు లేకపోయినా, చిన్న చిత్రాలు, రీ-రిలీజ్‌లు, ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులకు వినోదం అందుతోంది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్, ఫ్యామిలీ డ్రామా జానర్లలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

satan-the-dark-movie-got-trending-in-amazon-prime-video-after-ott-release-with-positive-talk

ప్రస్తుతం ఓ హారర్ మూవీ మాత్రం ఓటీటీని వణికించేస్తోంది. అదే 'సతన్ ది డార్క్'. థియేటర్లలో మార్చి 27న విడుదలైన ఈ చిత్రం హారర్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు మణికందన్ రామలింగం తెరకెక్కించిన ఈ సినిమాలో ఎఫ్.జె, అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడంతో మరింత మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. క్షుద్ర పూజలు, దుష్టశక్తులు, ఆధ్యాత్మిక భయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథ భయానకంగా సాగుతుంది.

స్టోరీ ఇదే..

క్షుద్ర పూజలు నిర్వహించే క్రమంలో ఒక ప్రమాదకరమైన దుష్టశక్తి బయటకు రావడం, అది ఒక చిన్నారి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చడం కథలో ప్రధానాంశం. ఆ చిన్నారిని కాపాడుకోవడానికి తల్లి చేసే పోరాటం, ఎదురయ్యే భయానక సంఘటనలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. 'సతన్' అంటే 'సైతాన్' అనే అర్థం రావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రెండు వేర్వేరు కాలరేఖల్లో ఈ మూవీని నడిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచే (మే 8 ) 'సతన్ ది డార్క్' స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో మిస్ అయిన హారర్ మూవీ లవర్స్ ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసి థ్రిల్ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. వేసవి సీజన్‌లో థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడాలనుకునే వారికి 'సతన్ ది డార్క్' మంచి ఛాయిస్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+