US-Iran War: ట్రంప్ కు ఇరాన్ భారీ షాక్- సై అంటే సై.. !


ఇరాన్ (Iran) దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ తిరిగి మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు అమెరికాను మరోసారి యుద్ద రంగంలోకి లాగుతున్నాయి. తమ సుప్రీం లీడర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చేసిన ప్రకటన, ఆ తర్వాత హార్ముజ్ జలసంధిలో నౌకలపై మొదలైన దాడులు, అనంతరం సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసినట్లేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్ధితిని మళ్లీ మొదటికి తెచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇవాళ కీలక ప్రకటన చేసింది.

Advertisement
హార్ముజ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్- షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశం..!
Advertisement

అమెరికాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణకు సంబంధించిన అన్ని అంశాల్ని నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ఇవాళ ప్రకటించింది. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఒప్పందం ఇకపై అమలులో లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. నాటూ సదస్సు సందర్భంగా ట్రంప్.. నా దృష్టిలో ఆ ఒప్పందం ముగిసిపోయింది. ఇరాన్ తో పనిచేయడం తనకు ఇష్టం లేదని తేల్చేశారు. అంతేకాకుండా ఇరాన్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వారు నీచమైనవారు, వికృత మనస్తత్వం కలిగినవారు, వికృత మనస్తత్వం ఉన్నవారే వారిని నడిపిస్తున్నారు, నా వరకు అయితే, వారితో వ్యవహరించడం కేవలం సమయం వృథా చేసుకోవడమే అని చెప్పేశారు.

Advertisement

US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..!

ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసినట్లేనని అధికారికంగా తేల్చేసింది. మరికొన్ని రోజుల్లో అమెరికా-ఇరాన్ వార్ తీవ్ర స్థాయికి చేరబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని వార్ బేస్ లు, ప్లాంట్లపై ఇరాన్ తీవ్ర దాడులు చేస్తోంది. అమెరికా వరుసగా ఏడవ రాత్రి కూడా ఇరాన్ లక్ష్యాలపై దాడులు నిర్వహించగా, ప్రతిస్పందనగా పూర్తిస్థాయి దాడి చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో హార్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.