తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ రాజకీయం పతాక స్థాయికి చేరింది. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం గులాబీ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. యువత కు మద్దతుగా తీర్మానం.. జాబ్ క్యాలెండర్ అంశాల్లో ప్రభుత్వం పై మండిపడ్డారు.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసారని... రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో గడ్డం వేణు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రస్తావించారు. రెండు పేజీల సూసైడ్ నోట్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, రాహుల్‌గాంధీకి రాశారని.. ఈ లేఖను వారికి షేర్ చేయాలని ఆయన తన సూసైడ్ నోట్‌లో తెలిపారని అన్నారు. ఈ లేఖ సూసైడ్ నోట్ కాదని కాంగ్రెస్ పాలనపై ఛార్జ్‌షీట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, దేశంలో యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఢిల్లీ నుంచి పెద్ద వాళ్లను తీసుకువచ్చి బిల్డప్పులు కొట్టారని ఎద్దేవా చేశారు.
కొత్త పెన్షన్లు అందేది వీరికే, జాబితా సిద్దం - పంపిణీ మార్గదర్శకాలు..!!
ముఖ్యమంత్రి ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నారని ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ ఉలకడు పలకడని ఎద్దేవా చేసారు. రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ కనపడరని చెప్పుకొచ్చారు. సొంత నియోజకవర్గంలో యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే భట్టి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 16,979 ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిందని గుర్తు చేసారు. తమ హయాంలో 2లక్షల 32వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని ప్రస్తావించారు.కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో
ఎమ్మెల్యేగా ఓడిపోతే సప్లిమెంటరీలో రేవంత్‌రెడ్డి ఎంపీ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నడైనా పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు రాశారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలుసు అని హెచ్చరించారు.