ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంతో పాటుగా అందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు.. సమస్యలు తనకు వదిలివే యాలని కోరారు. అదే విధంగా మండల స్థాయి నుంచి ఉపాధ్యాయులు సమస్యల పైన సీఎంఓ కు నివేదిక ఇవ్వాలని.. వచ్చే విద్య సంవత్సరం నుంచి మార్పులు చేస్తామని రేవంత్ ప్రకటించారు.
ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యావ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని చెప్పారు. రాష్ట్రం లోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పారు. విద్యలో నాణ్యత పెరగాలి, పిల్లలకు పౌష్టికాహారం అందాలని సూచించారు. తెలంగాణలో తనకు తెలిసిన మేధావులు ఇద్దరే.. కేకే, జైపాల్‌రెడ్డి అని అభివర్ణించారు. విద్య విషయంలో బాధ్యత తీసుకోవాలని కేకేను అడిగానని చెప్పుకొచ్చారు. ఆయన సలహాదారుగా అనేక సూచనలు చేస్తున్నారని తెలిపారు. వెనకబాటుతనానికి కారణం చదువులేకపోవడమేనని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్- పోలీసు అడ్వైజరీ..!!
పీవీ నర్సింహ రావు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారని సీఎం రేవంత్ తెలిపారు. సర్వేల్‌లో ఆ స్కూల్లోనే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చదువుకున్నారని ప్రస్తావించారు. నవోదయకు స్పూర్తి సర్వేల్ గురుకులమని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ విద్యా నాణ్యత సరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇంకా మెరుగైన నాణ్యమైన విద్య ఆశిస్తుందని తెలిపారు. బదిలీలు, ప్రమోషన్లు అన్నీ అడగకుండానే ఇచ్చానని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యలు తనకు వదిలేయాలని అన్నారు. వారి సమస్యలను తాను పరిష్కరిస్తానని మాటిచ్చారు. ప్రతి విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 2014-23 మధ్య డ్రాపౌట్స్ పెరిగాయని వివరించారు. 2023-26 వరకు డ్రాపౌట్స్ తగ్గి అడ్మిషన్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. విద్యా శాఖలో తాము తెచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని అన్నారు. మండల స్థాయి నుంచి ఉపాధ్యాయులు తీసుకురావాల్సిన మార్పుల పైన నివేదికలు ఇవ్వాలని.. తదనుగుణంగా వచ్చే విద్య సంవత్సరం ప్రారంభానికి నిర్ణయాలు అమలు చేస్తామని రేవంత్ ప్రకటించరాు.ఉపాధ్యాయులకు రేవంత్ హామీ