టీఆర్‌ఎస్‌ పేరు ఇవ్వలేం - ప్రత్యామ్నాయంగా..!!

కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)గా ఆమోదించలేమని తేల్చి చెప్పింది. పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావటంతో మరో పేరు ప్రతిపాదించాలని సూచించింది. అయితే, కవిత మాత్రం పేరు విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. దీని వెనుక బీఆర్ఎస్ ఉందని కవిత మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నారు.

Advertisement

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. తెలంగాణ రక్షణ సేనగా పార్టీ పేరు ప్రకటించారు. అయితే, ఈ పేరు పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ పరిశీలన చేసింది. ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు పంపించాలని సూచించింది. ఆ లేఖకు కవిత సమాధానం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కవితకు తెలంగాణ రక్షణ సేన పేరును కేటాయించడంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా.. అని ఈసీ కొంతకాలం క్రితం బహిరంగ ప్రకటన ఇచ్చింది. అప్పట్లో రెండు అభ్యంతరాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఒకటి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ జడ్పీటీసీ నుంచి వచ్చింది.

Advertisement

న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్న కవిత

ఆ జెడ్పీటీసీ తాను అప్పటికే తెలంగాణ రాజ్యసమితి (టీఆర్‌ఎస్‌) పేరుతో పార్టీ పెట్టానని, అందు వల్ల టీఆర్‌ఎస్‌ అన్న సంక్షిప్త నామంతో మరో పార్టీ ఉంటేఇబ్బంది అవుతుందని తెలిపారు. అదే విధంగా మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతం నుంచి మరో అభ్యంతరం వచ్చింది. ఈ రెండింటిపైనా కవిత ఎన్నికల సంఘానికి సమాధానం పంపారు. మొదట వచ్చిన రెండు అభ్యంతరాలకు సమాధానమిచ్చామని, ఇప్పుడు చెబుతున్న 'అనేక అభ్యంతరాలు' ఏమిటో చెబితే వాటికి కూడా సమాధానం ఇస్తామని కవిత కోరినట్లు తెలిసింది. తమకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పేరే కావాలని స్పష్టంచేసినట్ తెలుస్తోంది. న్యాయపోరాటం చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ పార్టీపై వచ్చిన ఫిర్యాదులు ఏంటో చెప్పకుండా పేరు మార్చుకోవాలని చెప్పడం సరికాదని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో కవిత పార్టీ పేరు విషయంలో తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English Summary

EC said the proposed name of her party TRS cannot be approved due to objections and claims received in over 1,100 letters from various parties