తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో

ప్రకృతిలో వెల కట్టలేని గొప్ప విషయాల్లో తల్లి ప్రేమది అగ్రస్థానం. అమ్మ ప్రేమకు రూపం లేదు.. కానీ అనుబంధం మాత్రం ఒకటే, అది మనుషులకైనా.. మూగజీవాలకైనా! మాటలు రాని ఆ మూగజీవాల మధ్య ఉన్న మమకారం ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైనదో నిరూపించే ఒక గుండెల్ని పిండేసే సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. కన్నతల్లి శాశ్వతంగా దూరమైందని తెలియని ఒక పసి ప్రాణం.. ఆ తల్లి మృతదేహాన్ని అతుక్కుని, ఆ గుండెలపైనే ఒదిగిపోయి నిద్రపోయిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కించిన ఈ హృదయ విదారక ఘటన తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో చోటు చేసుకుంది.

Advertisement

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గండి లచ్చపేట పరిధిలో ఒక తల్లి కోతి తన చిన్న పిల్లతో కలిసి రోడ్డు దాటుతోంది. సరిగ్గా అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆ తల్లి కోతిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ఆ తల్లి కోతి తీవ్ర గాయాలతో రోడ్డుపైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదాలు జరిగి రోడ్డు మీద పడినప్పుడు మనషులమే కొన్ని సెకన్ల పాటు ఏం జరిగిందో తెలియక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాం. ఇక మూగజీవాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర లేదు. అయితే, తనను నిరంతరం గుండెలకు హత్తుకుని కాపాడే అమ్మ ఇక లేదనే చేదు నిజం ఆ పసి కోతికి అర్థం కాలేదు. అమ్మ ఎందుకు కదలడం లేదు? ఎందుకు పలకరించడం లేదు? అని తెలుసుకోలేకపోయింది.

Advertisement

తల్లి ఒడిలోనే ఒదిగిపోయి..

రక్తం కారుతున్న తల్లి శరీరాన్ని చూసి భయపడిందో ఏమో కానీ.. ఆ పిల్ల కోతి ఎక్కడికీ వెళ్లకుండా చనిపోయిన ఆ తల్లి మృతదేహాన్ని గట్టిగా హత్తుకుంది. ఎప్పటిలాగే అమ్మ తనను లాలిస్తుందనే ఆశతో.. ఆ తల్లి ఒడిలోనే చేరి, గుండెలపై తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తున్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల్లి ప్రేమ, బిడ్డ అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఆ మూగజీవాల ప్రేమను చూసి అక్కడ చేరిన వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న వారి కళ్ల నుంచి నీళ్లు ఆగలేదు.

Advertisement

సురక్షితంగా తరలించిన గ్రామస్తులు..

ఈ గుండెలు విలవిలలాడే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తల్లి కోతి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆమె శరీరంపై నిద్రిస్తున్న పిల్ల కోతిని ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా, సురక్షితంగా అక్కడి నుంచి పక్కకు తరలించేందుకు ప్రయత్నించారు. నేటి సమాజంలో మనుషులే బంధాలను మర్చిపోతున్న తరుణంలో.. ఈ మూగజీవాల మధ్య ఉన్న నికార్సైన ప్రేమ, మమకారం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించివేసింది.

English Summary

A heartbreaking incident took place in Rajanna Sircilla district where a mother monkey died in a road accident. Unaware of the tragedy, the innocent baby monkey fell asleep hugging its mother's dead body, leaving locals in deep tears."