ప్రయాణీకుల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో నిత్యం లక్షలాది మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. వీరి ప్రయాణం సులభతరం చేసేందుకు మెట్రో కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్న వివిధ రకాల పాస్‌ల విధానాన్ని మెట్రోలోనూ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ఒకే పాస్ తో మెట్రో తో పాటుగా ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణం చేసేందుకు వీలుగా నిర్ణయాలు రానున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల కోసం కొత్త పాస్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మెట్రో అధికారుల కసరత్తు చేస్తున్నారు. గతంలోనూ పాస్ ల విధానం అమలు చేసారు. పలు రకాల రాయితీలు అందించారు. అయితే, ఆర్ధిక సమస్యల కారణంగా పాస్ ల విధానం రద్దు చేసారు. కాగా.. ఇప్పుడు తిరిగి నెల వారీ, మూడు నెలల పాస్ లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఆర్టీసీ అధికారులతో సమావేశమై, ప్రస్తుతం అమలులో ఉన్న పాస్‌ల రకాలు, వాటి ధరలు, ప్రయాణికుల స్పందన, ఆదాయంపై ప్రభావం వంటి అంశాలను విశ్లేషించ నున్నారు. ఆర్టీసీ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని మెట్రోకు అనువైన ప్రత్యేక పాస్‌లను అందుబాటులోకి తెచ్చే విధంగా కసరత్తు జరుగుతోంది.
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!
మెట్రోలో నిత్యం ప్రయాణాలు చేసే వారిలో విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ప్రయాణానికి విడివిడిగా టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో వారి పైన అదనపు భారం పడుతోంది. దీంతో.. ఒకే విడతగా పాస్ కొనుగోలు చేయటం ద్వారా సంస్థకు ఆదాయం.. అదే విధంగా వారి పైన భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు తాజాగా జరిగిన సమీక్షలో సూచనలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సగటున 4.70 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే సంఖ్య కొనసాగుతోంది. దీంతో.. ప్రయాణీకులను మరింతగా పెంచుకొనే వ్యూహాల పైన కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అన్నిటిలోను ఒకే టికెట్‌పై ప్రయాణించే విధానాన్ని పరిశీలన చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో నిర్వహణలో ప్రభుత్వ పాత్ర పెరగడంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా మళ్లీ ఆకర్షణీయమైన ప్రయాణ పథకాలను తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.ప్రయాణీకుల కోసం కొత్త నిర్ణయాలు