హైదరాబాద్- విశాఖ మధ్య తగ్గనున్న 56 కిమీ దూరం: గ్రీన్​ ఫీల్డ్ హై వే షురూ..!!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అప్డేట్. తెలంగాణ- ఏపీని అనుసంధానిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-365 బీజీ) మరో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇది వరకే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ హైవే పరిశీలన పూర్తి చేసింది. మరో వారంలో ఈ రహదారి పైన అధికారికంగా రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హై వే అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ రహదారి ద్వారా హైదరాబాద్​ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు సుమారు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. కొంతకాలంగా వైరా నుంచి దేవరపల్లి వరకు టోల్‌ప్లాజాలను తెరచి రవాణాకు అనుమతించారు. తాజాగా ఎడమ వైపు ఆర్వోబీ నిర్మాణం పూర్తవడంతో దాని మీదుగా రాకపోకలు కొనసాగించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. 162.04 కిలోమీటర్ల మేర 4 వరుసల రోడ్డును నిర్మాణం చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 105 కిలోమీటర్లు కాగా, 3 ప్యాకేజీల్లో రూ.2,213.91 కోట్లతో భారీ ఖర్చుతో నిర్మాణం చేపట్టారు.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

ప్రారంభానికి రంగం సిద్దం

సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు ఖమ్మం జిల్లాలోకి రాగానే తెల్దారుపల్లి దగ్గర ఉన్న టోల్​ గేట్​ ద్వారా గ్రీన్​ ఫీల్డ్​ హైవేపైకి ప్రవేశిస్తాయి. చివరగా దేవరపల్లి సమీపంలో నిష్క్రమణ (ఎగ్జిట్​) గేటు నుంచి దిగుతాయి. ఈ గ్రీన్ ​ఫీల్డ్​పై సాధారణ హైవేల మాదిరిగా టోల్​ ట్యాక్స్​ వసూలు చేయరు. వాహనం ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు ఉండే దూరాన్ని బట్టి మాత్రమే వసూలు చేస్తారు. హైవే పొడవునా ప్రతి కిలోమీటరుకు ఒక సీసీ కెమెరాను అమర్చారు. వందనం, చౌడవరం సమీపంలో భారీ గూడ్స్​ వాహనాలు నిలిపేలా ట్రక్​ లే బైలు కూడా ఏర్పాటు చేశారు.ఈ హైవేకు అమరావతి నుంచి నాగ్​పూర్​ వెళ్లే మరో గ్రీన్​ ఫీల్డ్​ హైవే వందనం-కొదుమూరు దగ్గర అనుసంధానం కానుంది. దీంతో, ఈ రహదారితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

English Summary

Khammam-Devarapalli access-controlled Greenfield Highway (NH-365BG) will be formally inaugurated in next week