ఫార్ములా-ఈ రేసు అక్రమాల కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను వెల్లడించింది. కాగా.. విచారణ వేళ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోరాటాలను అక్రమ కేసులు ఆపలేవని పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన కేటీఆర్, తనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకున్న ఆయన, తనకు ఎదురైన ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున మేం చేసే పోరాటాలను ఇటువంటి తప్పుడు కేసులు ఎంతమాత్రం ఆపలేవు.. అంతిమంగా సత్యమే గెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఎలాంటి తప్పు జరగలేదని.. తాను అవినీతి చేయలేదని చెబుతూ వచ్చారు. కాగా, తాజాగా దాఖలైన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.
తేల్చి చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రత్యామ్నాయం తప్పదు..!!
ఈ కేసులో కార్ రేస్‌తో HMDAకు రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, FEO కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఛార్జ్‌షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇందుల ప్రస్తావించి న అంశాలతో కేటీఆర్ న్యాయవాదులు విభేదించారు. కాగా.. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కేటీఆర్ లక్ష పూచీకత్తు , 2 షూరిటీస్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.కేటీఆర్ కీలక వ్యాఖ్యలు