కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- BRS కు వచ్చే సీట్లు ఎన్ని..!?

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత రాజకీయాలు సైతం సమస్యగా మారుతున్నాయి. బీజేపీ అధి నాయకత్వం తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ చేసిన సర్వే వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు వచ్చే సీట్ల పై విశ్లేషించిన అంశాల ను బీఆర్ఎస్ నేతలు బయట పెడుతున్నారు.

Advertisement

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దం అవుతోంది. ఇదే సమయం లో బీఆర్ఎస్ సైతం తమ వ్యూహాలకు పదును పెడుతోంది. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ సైతం బీఆర్ఎస్ ను రాజకీయంగా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. కాంగ్రెస్ పతనం ఖాయమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందో కాంగ్రెస్ చేయించిన సర్వేలో తేలిందని వివరించారు. సీఎం రేవంత్ సొంత సర్వే రిపోర్ట్ లో స్పష్టత వచ్చిందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సగం పదవీ కాలం పూర్తి కావటంతో ఈ సర్వే చేయించారని చెప్పారు. తన నాయకత్వంతో పాటుగా పరిపాలనపై ఈ సర్వే విస్తృతంగా చేయించారని వివరించారు.

Advertisement

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..

రేవంత్ చేయించిన సర్వేలో ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత కనిపించిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు దాదాపుగా 78 సీట్లు వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే వెల్లడించిందని తేల్చారు. అదే విధంగా తాజాగా రెండు మీడియా సంస్థలతో పాటుగా ఇంటలిజెన్స్ విభాగాలు చేసిన సర్వేలో ఇలాంటి ఫలితమే వచ్చిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ సర్వే వచ్చిన తరువాతనే రేవంత్ ప్రజాభిప్రాయం స్పష్టమ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్తగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పైనా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని..అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చెప్పిన సర్వే లెక్కలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.

English Summary

BRS working president KTR alleged that an internal survey commissioned by CM Revanth showed growing public dissatisfaction with the Congress