నల్గొండ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అమృత్ భారత్ స్కీమ్‌తో హై రేంజ్‌లో పునరాభివృద్ధి!

ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేందుకు భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఎ.బి.ఎస్.ఎస్)' ద్వారా భారీ పరివర్తనను చేపడుతోంది. ఈ పధకంలో భాగంగా తెలంగాణలో, ₹2000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు మరియు 2024 ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలోని స్టేషన్ల పునరాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో ఈ కార్యక్రమం గణనీయమైన ఊపందుకుంది.

Advertisement

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనున్న నల్గొండ రైల్వే స్టేషన్‌ ₹17.01 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడుతుంది. ఈ స్టేషన్ ప్రతిరోజూ దాదాపు 3,000 మంది ప్రయాణికులకు సేవలనందిస్తూ డెమూ/మెమూ సర్వీసులతో సహా రోజుకు సుమారు 44 రైళ్లను నిర్వహిస్తుంది. ఉపాధి మరియు వ్యాపార ప్రయోజనాల కోసం హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా సికింద్రాబాద్ , కాచిగూడ మరియు లింగంపల్లికి ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఒక కీలకమైన ప్రయాణ కేంద్రంగా పనిచేస్తుంది.

Advertisement

తెలంగాణ దక్షిణ భాగంలో ఉన్న నల్గొండ రైల్వే స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్ 4 స్టేషన్‌గా వర్గీకరించబడింది. ఇది దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది మరియు నడికుడి - బీబీ నగర్ సెక్షన్‌లో ఉంది. ఈ ప్రాంతంలోని ప్రయాణికులను హైదరాబాద్ నగరానికి మరియు ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు అనుసంధానించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తూ, తద్వారా ప్రాంతీయ రవాణా మరియు ఆర్థిక కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడుతుంది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రతిపాదించిన పునరాభివృద్ధి పనులలో భాగంగా 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం , 3,309 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్‌ఫారాలపై అదనపు పై కప్పు ఏర్పాటు , స్టేషన్ ప్రాంగణములో ఉద్యానవన రూపకల్పనతో అభివృద్ధి, 9,657 చదరపు మీటర్ల ప్లాట్‌ఫారమ్‌ ఉపరితలం మెరుగుదలలు, కాన్‌కోర్స్ అంతర్గత పునరుద్ధరణ, విఐపి లాంజ్, వెయిటింగ్ హాల్స్ మరియు టాయిలెట్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. వీటితోపాటు ప్రణాళికలో భాగంగా దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు, ప్రయాణీకులకు అనుకూలమైన కొత్త సూచికలు, ఆధునిక ఫర్నిచర్, అలాగే ముఖభాగం (ఫసాడ్) అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, స్టేషన్ అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

Advertisement

ప్లాట్‌ఫారాల పై కప్పు, లిఫ్టుల ఏర్పాటు, ప్లాట్‌ఫారమ్‌ ఉపరితలం మెరుగుదలలు , అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు, స్టేషన్ ప్రాంగణ ప్రాంతం మెరుగుదల, మరియు వెయిటింగ్ హాల్‌ల పునరుద్ధరణతో సహా అనేక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్టేషన్ ముఖభాగం మెరుగుదల, మరియు దివ్యాంగులకు సౌకర్యాల వంటి పునరాభివృద్ధి పనులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఈ పునరాభివృద్ధి ప్రయాణీకుల సౌకర్యాలను, అందుబాటును, మరియు మొత్తం ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. భారతీయ రైల్వే యొక్క మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కట్టుబడి, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందించాలనే సంకల్పాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తూ, తద్వారా రైల్వే స్టేషన్లను సౌకర్యాన్ని మరియు అనుసంధానాన్ని కలిగిన చైతన్యకేంద్రాలుగా మారుస్తుంది.

English Summary

Indian Railways is undertaking a major transformation through the 'Amrit Bharat Station Scheme (ABSS)' with the aim of redeveloping stations across the country to provide world-class facilities.