వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్ - డెడ్ లైన్, తాజా ఆదేశాలు..!!

ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్. వంట గ్యాస్ సరఫరా చేసే ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం వెల్లడించాయి. ఇప్పటి వరకు అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారుల కు ఈ కేవైసీ తప్పని సరి చేస్తూ పలు మార్లు గడువు పొడిగించారు. ఇప్పటికీ సబ్సిడీ తీసుకుంటు న్న అనేక మంది వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో, వారు వెంటనే పూర్తి చేయకుంటే సబ్సిడీ నిలుపుదలకు నిర్ణయించారు. తాజా డెడ్ లైన్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే చివరి ఛాన్స్ గా స్పష్టం చేసారు.

Advertisement

ఆయిల్ కంపెనీలు ఈ కేవైసీ పై తుది అలర్ట్ జారీ చేసాయి. గృహావసరాలకు వంట గ్యాస్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం లబ్ధిదారులు ఈ- కేవైసీ వివరాలు సమర్పించాలని ఇప్పటికే నిబంధన ఉంది. వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపి వేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల గృహ గ్యాస్‌ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 60 శాతం మంది మాత్రమే స్పందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతియేటా ఒకసారి ఈ- కేవైసీ ఇవ్వకపోతే... ఏడాదిలో వారికి ఇక నుంచి ఇచ్చే సిలిండర్ల సబ్సిడీ నిలిపి వేస్తామని ఆయిల్‌ కంపెనీలు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. ఈ నెల16వ తేదీ లోగా ఈ కేవైసీ పూర్తి చేయని వారికి ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని రద్దుచేస్తామని తేల్చి చెప్పాయి.

Advertisement
ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

వినియోగదారులకు కీలక సూచనలు

ఇదే సమయంలో ఈ నిబంధన పైన స్పష్టత ఇచ్చాయి. సబ్సిడీ రాకపోయినా గ్యాస్‌ సరఫరా, రీఫిల్‌ బుకింగ్‌కు అంతరాయం ఉండదని, మొత్తం ధర చెల్లించి సిలిండరు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, వినియోగ దారులు మొబైల్‌ యాప్‌ ద్వారా బయోమెట్రిక్‌ ఆధార్‌ ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించారు. క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి మొబైల్‌ ద్వారా చేసుకోవచ్చు. సంబంధిత ఏరియా పంపిణీకేంద్రానికి వెళ్లి చేసుకొనే అవకాశం కల్పించారు. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చే డెలివరీ సిబ్బంది కూడా ఈ- కేవైసీ నమోదు చేస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా.. ఈ నెల 16 వరకు గడువు పెంచారు. ఈలోపు వందశాతం పూర్తిచేయాలని ఆయిల్‌ కంపెనీలు గడువు విధించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 70 శాతం వరకే ఈ-కేవైసీ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ చేయకపోతే కనెక్షన్‌ సబ్సిడీ రద్దు అవుతుందంటూ జరుగుతున్న ప్రచారం వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

English Summary

Oil companies have cautioned LPG consumers to complete their e-KYC by August 16, issues latest guide lines