వచ్చే వారం పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు - ఇదీ లిస్ట్..!!

విద్యార్ధులు.. పేరెంట్స్ కు బిగ్ అలర్ట్. ఆగస్టు నెలలో విద్య సంస్థలకు పెద్ద సంఖ్యలో సెలవులు ప్రకటన చేసారు. ఈ వారాంతం నుంచి వరుసగా మూడు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తాజాగా ఆదేశాలు అందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. అదే విధంగా ఈ నెల ద్వితీయార్ధంలోనూ సెలవులు రానున్నాయి. దీంతో... విద్యార్ధుల పేరెంట్స్ ఈ సెలవులకు అనుగుణం గా ప్లాన్ చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు.

Advertisement

ఈ వారాంతంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జూలై 16న ప్రారంభం అయిన బోనాలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, పాతబస్తీ లాల్ దర్వాజా జాతరతో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. తాజాగా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇక, ఈ నెల 9వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరుసటి రోజు ఆగస్టు 10న రంగం భవిష్యవాణి మరియు గజవాహన ఊరేగింపు ఉంటాయి. కాగా.. ఆ రోజున విద్యా సంస్థలకు సెలవుగా ఖరారు కానుంది. 8వ తేదీన రెండో శనివారం, 9న ఆదివారం, 10న బోనాల సెలవు అమలు చేయనున్నారు.

Advertisement
ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

ఈ నెలలో వరుస సెలవులు

అదే విధంగా ఈ నెలలో మరిన్ని సెలవులు విద్యార్ధులకు ప్రకటించారు. 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న ఆదివారం, ఆగస్టు 26న ఈద్-మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రక్షా బంధన్ సెలవులుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే.. గత వారం భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ప్రత్యేకంగా విద్యా సంస్థలకు సెలవు అమలు చేసారు. ఆ ప్రాంతాల్లో ఈ నెల 8వ తేదీన రెండో శనివారం విద్యా సంస్థలను ప్రత్యేకంగా పని చేయాలని అధికారులు సూచించారు. వరుసగా శని, ఆది, సోమవారాలు మూడ్రోజుల పాటు వరుసగా విరామం లభించనుంది. ఒకే దెబ్బకు మూడు రోజులు కలిసి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ వేళ బయట ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

English Summary

Schools in the twin cities will enjoy three consecutive holidays this month, with August 10 declared a holiday for Bonalu celebrations