ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు ఇలా, ముహూర్తం..!!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు కు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది కలిపి మొత్తం చెల్లింపు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసం నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వీటి చెల్లింపు పైన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోగా చెల్లిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

తెలంగాణలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఈ ఏడాదికి కలిపి మొత్తం బకాయిలు రూ.10,000 కోట్ల నుండి రూ.12,000 కోట్ల వరకు చేరాయి. ఇప్పటికే ఈ వ్యవహారం పైన రాష్ ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీంతో, ఆగస్టు 15లోగా ఈ ఏడాదికి సంబంధించిన బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది. 2, 3, 4వ సంవత్సరం విద్యార్థులకూ ఫీజు చెల్లిస్తామని పేర్కొంది. ఫీజు రీయింబర్స్​ మెంట్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదంటూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు.

Advertisement

హైకోర్టుకు వెల్లడించిన ప్రభుత్వం

రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. 2023 నుంచి ఉన్న పెండింగ్​ బకాయిలు వెంటనే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు కోరాయి. తర్వాత కొంత గడువుతో మిగతా బకాయిలు చెల్లించేలా చూడాలని హైకోర్టును అభ్యర్దించారు. గత విచారణలో జీవో9లో నాలుగు నిబంధనలపై షరతు విధించింది. అందులో కొన్ని నిబంధలపై విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వ తరపు న్యాయవాది వచ్చే నెల ఆగస్టు 15 లోగా బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేసారు. దీంతో.. కళాశాలల యాజమాన్యాలు నిరీక్షిస్తున్న బకాయిల చెల్లింపు కు ముహూర్తం ఫిక్స్ అయింది.

English Summary

Telangana government informed the High Court that the entire fee reimbursement amount will be released by August 15