ఇక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తప్పనిసరి - ప్రభుత్వం ఆదేశాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారుల‌ను ఆదేశించారు. ​గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులను మంత్రి నిర్దేశించారు.సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఐటీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

మంత్రి శ్రీధర్ బాబు కీలక సూచనలు చేసారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని స్పష్టం చేసారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని అధికారుల‌కు సూచించారు. ​'టీ-స్వాన్' నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని.. ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

Advertisement
హైదరాబాద్- విశాఖ మధ్య తగ్గనున్న 56 కిమీ దూరం: గ్రీన్​ ఫీల్డ్ హై వే షురూ..!!

మంత్రి కీలక ఆదేశాలు

కాగా, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికి ఇంటర్నెట్' ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

English Summary

Telangana govt give key orders to use of T fiber internet in all govt offices as mandatory from Sep 1